ETV Bharat / entertainment

ఆస్కార్‌ రేసు.. ఇప్పటివరకు నామినేట్‌ అయిన భారతీయ చిత్రాలివే..

Oscar Nominations: భారతదేశం నుంచి ఇప్పటివరకూ ఆస్కార్‌కు నామినేట్‌ అయిన చిత్రాలు, వాటి వివరాలు ఇవే!

Indian Cinemas Oscar Nominations List
భారత సినిమాల ఆస్కార్ల జాబితా
author img

By

Published : Jan 24, 2023, 10:08 PM IST

Oscar Nominations: యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూసిన ఆస్కార్‌ అవార్డుల నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. వివిధ కేటగిరిల్లో పలు చిత్రాలు నామినేట్​ అయ్యాయి. ఈ ఏడాది వివిధ భాషల్లో దాదాపు 300ల సినిమాలు ఆస్కార్‌ నామినేషన్‌కు షార్ట్‌లిస్ట్‌ అవ్వగా, వాటిలో ఉత్తమ చిత్రాలు ఇప్పుడు అవార్డుల బరిలో నిలిచాయి. భాషతో సంబంధం లేకుండా అందరినీ అలరించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌'లోని 'నాటు నాటు' పాట ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. ఈ ఏడాది భారత ప్రభుత్వం అధికారికంగా గుజరాతీ చిత్రం 'ఛెల్లో షో'ను నామినేషన్‌కు పంపినా తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. ఇప్పటివరకూ ఏయే భారతీయ సినిమాలు ఆస్కార్‌ అవార్డుల తుదిపోరులో నిలిచాయో ఇప్పుడు చూద్దాం!

భారతదేశం నుంచి తొలిసారి ఆస్కార్‌ అవార్డుల బరిలో నిలిచిన చిత్రం 1957లో విడుదలైన 'మదర్‌ ఇండియా'. మెహబూబ్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నర్గీస్‌, సునీల్‌దత్‌, రాజేంద్రకుమార్‌, రాజ్‌కుమార్‌లు కీలక పాత్రలు పోషించారు. దేశంలోని గ్రామాల పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. సగటు భారతీయ స్త్రీ, తన కుటుంబం కోసం, తన పిల్లలకోసం పడే కష్టాలను భావోద్వేగభరితంగా ఈ సినిమాలో చూపించారు.

Mother India First Indian Film To Oscar Nominations
భారతదేశం నుంచి ఆస్కార్​కు నామినేటయిన మొదటి చిత్రం మదర్‌ ఇండియా

'మదర్‌ ఇండియా' తర్వాత ఆస్కార్‌కు మరో భారత చిత్రం నామినేట్‌ అవ్వడానికి చాలా కాలమే పట్టింది. 1988లో వచ్చిన బాలీవుడ్‌ సినిమా 'సలామ్‌ బాంబే' ఆస్కార్స్​ నామినేషన్‌లో స్థానం సంపాదించింది. మీరా నాయర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో షఫీక్‌ సయీద్‌, హంస విఠల్‌, చందా శర్మ, నానా పటేకర్‌, రఘువీర్‌యాదవ్‌, అనిత కన్వర్‌ కీలక పాత్రలు పోషించారు. అప్పటి ముంబయిలోని వీధి బాలల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను తెరకెక్కించారు. మురికివాడల్లో నివసించే చిన్నారుల రోజువారీ జీవితాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు.

Salaam Bombay Second Indian Film To Oscar Nominations
భారతదేశం నుంచి ఆస్కార్​కు నామినేటయిన రెండో చిత్రం సలామ్​ బంబే

ఇక భారతదేశం నుంచి ఆస్కార్‌కు నామినేట్‌ అయిన మూడో చిత్రం 'లగాన్‌' ఆమిర్‌ఖాన్‌ కీలకపాత్రలో అశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. గ్రేసీ సింగ్‌, రాచెల్‌ షెల్లీ, పాల్‌ బ్లాక్‌ థ్రోన్‌లు ముఖ్య పాత్రలు పోషించారు. 2001లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. బ్రిటిషర్లు విధించే పన్ను నుంచి మినహాయింపు పొందడం కోసం ఓ భువన్‌(ఆమిర్‌) అనే యువకుడు వారితో క్రికెట్‌ ఆడాల్సి వస్తుంది. క్రికెట్‌ బ్యాటు కూడా పట్టుకోవడం రాని కొందరు గ్రామస్థులను కూడదీసి, వారితో కలిసి బ్రిటిషర్లపై మ్యాచ్‌ ఆడి ఎలా నెగ్గాడు? ఈ క్రమంలో భువన్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? తదితర అంశాలతో ఎంతో ఎమోషనల్​గా లగాన్‌ను తీర్చిదిద్దారు దర్శకులు అశుతోష్‌ గోవారికర్‌.

Lagaan Third Indian Film To Oscar Nominations
భారతదేశం నుంచి ఆస్కార్​కు నామినేటయిన మూడో చిత్రం లగాన్‌

'లగాన్‌' తర్వాత ఇప్పటివరకూ మరే భారతీయ చిత్రమూ ఆస్కార్‌ అవార్డుల తుదిపోరుకు నామినేట్‌ కాలేదు. 1957 నుంచి ఇప్పటివరకు మొత్తం 54 చిత్రాలు భారత్‌ నుంచి ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌కు వెళ్లాయి. ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌కు వెళ్లిన ఏకైక తెలుగు చిత్రం 'స్వాతిముత్యం'. కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. ఆ సినిమా తర్వాత తెలుగు నుంచి ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్‌' లోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరి తుది జాబితాలో చోటు దక్కించుకుని తెలుగువారి కీర్తిని మరింత పెంచింది. కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, కాలభైరవ-రాహుల్‌ సిప్లిగంజ్‌లు పాడారు. ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రఫీ చేశారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించారు.

RRR Fourth Indian Film To Oscar Nominations
భారతదేశం నుంచి ఆస్కార్​కు నామినేటయిన నాల్గో చిత్రం ​ఆర్​ఆర్​ఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.