ETV Bharat / entertainment

ఒకే మూవీలో 'శాకుంతలం' సమంత- 'సీతారామం' మృణాల్​.. సూపర్​ హిట్​ పక్కా! - మృణాల్​ ఠాకూర్​ అప్డేట్లు

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంత, సీతారామం బ్యూటీ మృణాల్​ ఠాకూర్​.. త్వరలోనే కలిసి ఓ మూవీ చేయనున్నారట. ఈ విషయాన్ని సమంత స్వయంగా తెలిపారు! ఈ విషయం తెలిసి వీరిద్దరి ఫ్యాన్స్​ తెగ సంబరపడిపోతున్నారు.

Etv heroine samantha responds to seetaramam mrunal thakur question to act in same movie
heroine samantha responds to seetaramam mrunal thakur question to act in same movie
author img

By

Published : Apr 10, 2023, 3:55 PM IST

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంత.. టైటిల్​ రోల్​ పోషిస్తున్న చిత్రం శాకుంతలం. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞానం శాకుంతల నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు. ఏప్రిల్‌ 14న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం సామ్‌ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌ వేదికగా సమంత తన అభిమానులతో సరదాగా ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానాలిచ్చింది. ఈ క్రమంలోనే సీతారామం బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ కూడా సమంతను ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేసింది.

"శాకుంతలం చూడటానికి వేచి ఉండలేను..! మీరు చాలా స్ఫూర్తిదాకయంగా ఉన్నారు సామ్‌. మనమిద్దరం కలిసి ఎప్పుడు సినిమా చేస్తున్నామన్నదే నా ప్రశ్న..?" అంటూ ప్రశ్నించింది. దీనికి సామ్‌ స్పందిస్తూ.. "గుమ్రా చిత్రానికి గానూ అందమైన మృణాల్‌కు శుభాకాంక్షలు. ఈ ఐడియా నాకు నచ్చింది. మనిద్దరం కలిసి ఓ సినిమా చేద్దాం" అంటూ సమాధానమిచ్చింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ట్వీట్స్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు "మీరిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని ఉంది", "మృణాల్‌ ఐడియా సూపర్‌" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'ఒకే మూవీలో 'శాకుంతలం' సమంత- 'సీతారామం' మృణాల్​.. సూపర్​ హిట్​ పక్కా!' అని కామెంట్లు పెడుతున్నారు.

heroine samantha responds to seetaramam mrunal thakur question to act in same movie
సమంత- మృణాల్​ ఠాకూర్​ ట్విట్టర్​ చాట్​

గత కొంతకాలంగా మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్న సమంత‌.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అనారోగ్యం కారణంగా యశోద సినిమా తర్వాత కాస్త బ్రేక్‌ తీసుకున్న సామ్‌.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడింది. శాకుంతలంతోపాటు విజయ్‌ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలోనూ నటిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బాలీవుడ్‌లో సిటాడెల్‌ అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తోంది. అమెరికన్‌ యాక్షన్‌ టీవీ సిరీస్‌కు హిందీ రీమేక్‌గా ఈ వెబ్‌ సిరీస్‌ను రాజ్‌ డీకే తెరకెక్కిస్తున్నారు.

సీతారామం సీక్వెల్​ ఉందా?
మరోవైపు, టాలీవుడ్​లో తొలి చిత్రం సీతారామంతో బ్లాక్​ బస్టర్​ హిట్​ అందుకుంది మృణాల్​ ఠాకూర్​. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీత పాత్రలో మృణాల్​ అదరగొట్టింది. ఎందరో అభిమానుల మనసు దోచుకుంది. అయితే సీతారామం చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందా? లేదా? అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఓ ఇంటర్య్వూలో సీక్వెల్‌కు ప్లాన్‌ చేస్తున్నట్లు డైరెక్టర్‌ చెప్పారు. దీంతో అప్పటి సీతారామం టీంకు స్వీకెల్‌పై ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇటీవలే ట్విట్టర్​ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించిన మృణాల్‌కు సీతారామం సీక్వెల్‌పై ప్రశ్న ఎదురైంది. ఓ అభిమాని "సీతా రామంకు సీక్వెల్‌ ఉందా?" అని మృణాల్‌ను అడిగాడు. ఆ ప్రశ్నకు "సీతారామం నిజంగా అద్భుతమైన చిత్రం. ఈ సినిమా సీక్వెల్‌ ఉంటుందా? లేదా? అనేది కచ్చితంగా తెలియదు. కానీ, ఈ మూవీ సీక్వెల్‌ ఉంటే బాగుండు అనుకుంటున్నా. దానికి కోసం నేరు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని సమాధానం ఇచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.