ETV Bharat / entertainment

గోపీచంద్​ 'రామబాణం' - నరేశ్​ 'ఉగ్రం' ఫస్ట్ డే కలెక్షన్స్​ - అల్లరి నరేశ్​ ఉగ్రం ఫస్ట్ డే కలెక్షన్స్​

యాక్షన్ హీరో గోపీచంద్ 'రామబాణం'​, విలక్షణ నటుడు అల్లరి నరేశ్​ 'ఉగ్రం'.. నటించిన ఫస్ట్ డే కలెక్షన్స్​ వివరాలు బయటకు వచ్చాయి. ఎంతంటే?

Gopichand Ramabanam and Allari Naresh ugram first day collections
గోపిచంద్​ 'రామబాణం' - నరేశ్​ 'ఉగ్రం' ఫస్ట్ డే కలెక్షన్స్​
author img

By

Published : May 6, 2023, 12:51 PM IST

Updated : May 6, 2023, 2:15 PM IST

యాక్షన్ హీరో గోపీచంద్​, విలక్షణ నటుడు అల్లరి నరేశ్​.. ఇద్దరు ఒకేరోజు మే 5న తమ కొత్త చిత్రాలో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. గోపిచంద్​ రాణబాణంతో రాగా.. నరేశ్​ ఉగ్రంతో పలకరించారు. అయితే ఈ రెండు చిత్రాల ఓపెనింగ్ కలెక్షన్స్​ వివరాలు బయటకు వచ్చాయి. అయితే ఇవి రెండు మోస్తరు వసూళ్లనే సాధించినట్లు తెలుస్తోంది.

ఆశించిన స్థాయిలో నో.. గోపీచంద్​ నటించిన 'రామబాణం' ప్రపంచవ్యాప్తంగా 840 థియేటర్లలో విడుదలైనట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 620కి పైగా థియేటర్లలో రిలీజ్ అయినట్లు సమాచారం. బాక్సాఫీస్ వద్ద రూ.14.5 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సినీ వర్గాల టాక్​. అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.15.20 కోట్లుగా నమోదైంది. కానీ తొలిరోజు ఈ చిత్రానికి మిక్స్​డ్​ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్​ విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.1.17కోట్లు షేర్​, రూ.2.20కోట్ల గ్రాస్​ వచ్చిందట. వరల్డ్​వైడ్​గా తొలి రోజు రూ.1.27 కోట్ల షేర్​, రూ.2.45కోట్లు గ్రాస్​ వచ్చినట్లు అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం 'లక్ష్యం', 'లౌక్యం' తర్వాత శ్రీవాస్​- గోపీచంద్ కాంబినేషన్​లో వచ్చిన మూడో సినిమా ఇది. డింపుల్ హయాతీ, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, ఖుష్బూ, అలీ, నాజర్, వెన్నెల కిషోర్, రాజా రవీంద్ర, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా త‌దిత‌రులు నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పర్వాలేదనిపించేలా వసూళ్లు.. రూ.15కోట్లతో రూపొందిన నరేశ్​ 'ఉగ్రం' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్​ రూ.6.5 కోట్లు చేసిందని టాక్​ వినిపించింది. ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో హిట్​ టాక్​ను అందుకోలేదు. తొలి రోజు ఈ చిత్రానికి ఏపీ, తెలంగాణలో రూ.1.5 కోట్ల షేర్, రూ. 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు తెలిసింది. ఇక కర్ణాటక, ఓవర్సీస్‌లో కలిపి మొత్తంగా ఈ చిత్రం రూ.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందట. ఇకపోతే ఈ చిత్రం.. 'నాంది' వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్​ కనకమేడ-అల్లరినరేశ్ కాంబోలో వచ్చింది. ఇందులో నరేశ్​ పోలీస్‌ ఆఫీసర్​గా సరికొత్త యాక్షన్‌ అవతారంలో కనిపించారు. మిర్నా మేనన్‌, ఇంద్రజ, శరత్‌ లోహితాస్వ, శత్రు, శ్రీనివాస్‌ సాయి, మణికంఠ వారణాసి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు. సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది కలిసి చిత్రాన్ని నిర్మించారు.

ఇదీ చూడండి: గుర్రపు స్వారీ చేస్తుండగా కిందపడ్డ మోడల్​.. చికిత్స పొందుతూ మృతి!

Last Updated : May 6, 2023, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.