ETV Bharat / entertainment

ఒకేసారి ఇద్దరితో డేటింగ్​.. కూతురుపై షారుక్​ సతీమణి కామెంట్స్​ - కాఫీ విత్ కరణ్​ గౌరీ ఖాన్​

డేటింగ్ విషయంలో కూతురుపై బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్​ సతీమణి గౌరీ ఖాన్​ కామెంట్స్​ చేశారు. ఏమన్నారంటే...

suhana khan dating
సుహానా ఖాన్ డేటింగ్
author img

By

Published : Sep 19, 2022, 3:26 PM IST

నా కూతురికి ఒకే సమయంలో ఇద్దరు అబ్బాయిలతో డేట్‌ చేయొద్దని సూచిస్తా అని అన్నారు షారుక్​ ఖాన్‌ సతీమణి గౌరీ ఖాన్‌. ఇంటీరియర్‌ డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకొని కెరీర్‌లో రాణిస్తున్న ఆమె.. తాజాగా కాఫీ విత్ కరణ్​ షోలో పాల్గొని సందడి చేశారు. తన స్నేహితులు భావన పాండే, మహీప్‌ కపూర్‌లతో కలిసి ఆమె పాల్గొన్నారు. కరణ్‌ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చారు. "డేటింగ్‌ విషయంలో మీ కుమార్తె సుహానా ఖాన్‌కు మీరిచ్చే సలహా ఏమిటి?" అని కరణ్‌ ప్రశ్నించగా.. ఈ సమాధానం చెప్పారు. అనంతరం షారుఖ్‌తో తన ప్రేమకథకు 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' టైటిల్‌ పెడతానని ఆమె చెప్పుకొచ్చారు. తమ ప్రేమకథలో గొడవలున్నాయని ఆమె తెలిపారు.

అనంతరం, "ఒకవేళ మీకు ఏదైనా సినిమాలో నటించే అవకాశం వస్తే హీరోగా మీ సరసన ఎవరు నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు?" అని మహీప్‌కపూర్‌ను కరణ్‌ ప్రశ్నించాడు. "హృతిక్‌రోషన్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని ఉంది. మా ఇద్దరి జోడీ చూడముచ్చటగా ఉంటుందని నమ్ముతున్నా" అని మహీప్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది.

ఇదీ చూడండి : న్యూ లుక్​లో సూపర్​ స్టైలిష్​గా మహేశ్.. గంగూబాయ్​గా మారిన నిహారిక​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.