ETV Bharat / entertainment

మన హీరోల సినిమాలు..ఆలస్యంగా రావడానికి కారణం ఇదేనా..? - హరిహర వీర మల్లు సినిమా విడుదల

మన అగ్ర హీరోల కొత్త సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఒక పోస్టర్​ విడుదలైతే చాలు వాళ్ల ఆనందానికి అవధులుండవు. అయితే ప్రస్తుతం మన హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాల్ని మించి చేయడానికి సాధ్యం కావడం లేదు. ఎందుకంటే..?

tollywood top heros
తెలుగు హీరోలు
author img

By

Published : Nov 15, 2022, 10:01 AM IST

మన సినిమాల స్థాయి పెరిగింది. అగ్ర కథానాయకుడి సినిమా అంటే పలు భాషల్ని లక్ష్యంగా చేసుకుని రూపొందాల్సిందే. రూ.వందల కోట్ల వ్యయం... భారీ తారాగణం... అత్యున్నత సాంకేతిక వర్గం... ఇలా చాలా లెక్కలే ఉంటాయి. ఆ స్థాయికి తగ్గట్టుగానే పూర్వ నిర్మాణ పనులు, చిత్రీకరణ, నిర్మాణానంతర పనులు సాగుతుంటాయి. ఇదివరకటిలా సెట్‌పైకి వెళ్లాక చూసుకుందాం అన్నట్టు కాకుండా... ముందుగా స్క్రిప్ట్‌ని సిద్ధం చేయడం కోసమే ఏళ్లు కేటాయిస్తున్నారు.

చిత్రీకరణలు, నిర్మాణానంతర పనుల కోసం కూడా బోలెడంత సమయం కేటాయిస్తున్నారు. దాంతో అభిమాన తారల సందడికి కాస్త ఎక్కువ సమయమే పడుతోంది మరి! సినిమా తర్వాత మరో సినిమాకి రెండేళ్లు కావొచ్చు, మూడేళ్లు కావొచ్చు, విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న సినిమా అయితే అంతకంటే ఎక్కువ సమయమే పట్టొచ్చు.

ఏడాదికి రెండు సినిమాలైనా చేస్తానంటూ ఇదివరకు తారలు వాళ్ల అభిమానులకి మాట ఇచ్చేవాళ్లు. అందుకు తగ్గట్టుగానే వడివడిగా సినిమాలు చేయడానికి ప్రయత్నించేవాళ్లు. మారిపోయిన ఈ పరిస్థితుల్లో అలా ఏడాదికి రెండు మూడు సినిమాల్ని చేయడానికి సాధ్యం కావడం లేదు. అభిమానులు కూడా అలా కోరుకోవడం లేదు. వాళ్లు ఆశిస్తున్నదంతా ఆయా సినిమాలకి సంబంధించిన అప్‌డేట్స్‌ మాత్రమే. చిత్రం మొదలయ్యేది ఎప్పుడు? టీజర్‌, ట్రైలర్‌ల మాటేమిటి? విడుదల ఎప్పుడు? అనే విషయాలు ఎప్పటికప్పుడు తెలిస్తే చాలు... వాటితోనే ఖుషీ అవుతుంటారు.

కొన్నిసార్లు ఆ వివరాలు కూడా చెప్పడం లేదంటూ రకరకాలుగా ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు అగ్ర తారల నుంచి ఏడాదికో సినిమా వస్తుందంటే వాళ్లు వేగం పెంచేసినట్టే లెక్క! ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే, మరో సినిమా కోసం కథల్ని విని ఓకే చేస్తున్నా సరే, ఏడాదికో సినిమా పూర్తి కావడం లేదు. కొన్ని సినిమాలు రెండు మూడేళ్లు చిత్రీకరణలు జరుపుకొంటున్నాయి. ఈ ఏడాది అగ్ర హీరోలు దాదాపు తెరపై సందడి చేశారు. మళ్లీ వాళ్లని తెరపై చూడటం కోసం కాస్త ఓపికతో వేచి చూడాల్సిందే.

tollywood top heros
తెలుగు అగ్ర హీరోలు

'బాహుబలి' నుంచి ప్రభాస్‌ సినిమాల కోసం ఎప్పుడూ ఎదురు చూపులే. ఆ చిత్రాలు పూర్తయ్యాక ఇక వేగం పెంచేస్తానని ఆయన చెప్పారు. చెప్పినట్టే వేగంగా సినిమాల్ని పట్టాలెక్కించినా, పలు కారణాలతో అవి ఆలస్యమవుతూ వచ్చాయి. ఈ ఏడాడే ఆయన 'రాధేశ్యామ్‌' ప్రేక్షకుల ముందుకొచ్చింది. వచ్చే సంక్రాంతికి 'ఆదిపురుష్‌' విడుదల ఖరారు కావడంతో, ఈసారి ఏడాదిలోపే ప్రభాస్‌ని మరోసారి తెరపై చూడొచ్చని ఆశపడ్డారు ప్రేక్షకులు. కానీ 'ఆదిపురుష్‌'ని వచ్చే ఏడాది జూన్‌ 16కి వాయిదా వేస్తున్నట్టు ఆ చిత్రబృందం ప్రకటించింది. 'ఆదిపురుష్‌' వాయిదా ప్రభావం ఆయన తదుపరి సినిమాల విడుదలలపై కూడా పడే అవకాశాలున్నాయి.

పవన్‌కల్యాణ్‌ 'హరి హర వీర మల్లు' 2020లోనే సెట్స్‌పైకి వెళ్లింది. ఇప్పటికే దాదాపుగా రెండేళ్లుగా సెట్స్‌పై ఉన్న ఈ సినిమా పూర్తి కావడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశాలు ఉన్నాయి. ‘భీమ్లానాయక్‌’తో సందడి చేసిన పవన్‌కల్యాణ్‌, మళ్లీ వచ్చే ఏడాది వేసవికి ‘హరి హర వీర మల్లు’తోనే సందడి చేస్తారు. దాదాపు సంవత్సరం తర్వాత ఆయన తెరపై కనిపిస్తారన్నమాట.

tollywood top heros
తెలుగు అగ్ర హీరోలు

అల్లు అర్జున్‌ గతేడాది డిసెంబరులో ‘పుష్ప’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 'పుష్ప2' కోసం ముందే కథ సిద్ధమైనప్పటికీ, దాన్ని పట్టాలెక్కించడానికి సంవత్సరంపైగానే సమయం పట్టింది. అల్లు అర్జున్‌ ఏడాదికి పైగా మరే సినిమా చేయకుండా 'పుష్ప2' ఆరంభం కోసమే ఎదురు చూశారు. 'పుష్ప' సంచలన విజయం సాధించడంతో, దాన్ని జాతీయ అంతర్జాతీయ ప్రేక్షకులకు తగ్గట్టుగా తెరకెక్కించాలనే లక్ష్యంతో పూర్వ నిర్మాణ పనుల్ని జరిపారు. అందుకే ఇంత సమయం పట్టింది. ఆ సినిమా చిత్రీకరణకీ, నిర్మాణానంతర పనులకి ఇంకెంత సమయం పడుతుందో మరీ! ఏడాదిలోపే పూర్తయ్యి, విడుదలైనా తెరపై అల్లు అర్జున్‌ పునర్దర్శననానికి దాదాపు రెండేళ్లు పట్టినట్టే లెక్క. ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడనేది డిసెంబరు 16న విడుదల కానున్న ప్రచార చిత్రంతో తెలిసే అవకాశం ఉంది.

మహేష్‌బాబు ఈ ఏడాదే 'సర్కారు వారి పాట'తో సందడి చేశారు. తదుపరి త్రివిక్రమ్‌ సినిమాతోనే సందడి చేస్తారు. వచ్చే ఏడాది ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్‌ - త్రివిక్రమ్‌ కలయికలో సినిమా చాలా రోజుల కిందే ఖరారైనప్పటికీ, పట్టాలెక్కడానికి మాత్రం ఐదు నెలలపైనే పట్టింది. వచ్చే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రావొచ్చని సమాచారం.

'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత ఎన్టీఆర్‌ చేయనున్న కొత్త సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఆ చిత్రం విడుదలై దాదాపు ఎనిమిది నెలలవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న ఆ చిత్రం పూర్వ నిర్మాణ పనుల్లో ఉంది. ఈ కలయికలో సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రీకరణలో ఉన్నప్పుడే ఖరారైంది. అయినా స్క్రిప్ట్‌ని పకడ్బందీగా తీర్చిదిద్దేందుకని సమయం తీసుకొంటున్నారు కొరటాల. వచ్చే దసరా లక్ష్యంగా పట్టాలెక్కనున్నట్టు సమాచారం. మరి ఆలోపు చిత్రీకరణ, నిర్మాణానంతర పనుల్ని పూర్తి చేసుకుని విడుదలవుతుందో లేదో చూడాలి. అప్పుడొచ్చినా ఎన్టీఆర్‌ని మళ్లీ ఏడాదిన్నర తర్వాతే తెరపై చూసినట్టవుతుంది.

సీనియర్‌ కథానాయకులు మాత్రం తమ బృందాల్ని పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి 'ఆచార్య' తర్వాత 'గాడ్‌ఫాదర్‌'తో సందడి చేశారు. సంక్రాంతికి 'వాల్తేర్‌ వీరయ్య'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరోపక్క ‘భోళాశంకర్‌’ చిత్రీకరణలోనూ పాల్గొంటున్నారు. 2021 డిసెంబరులో 'అఖండ'తో సందడి చేసిన బాలకృష్ణ, సంక్రాంతికి 'వీరసింహారెడ్డి'గా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.
ఇదీ చదవండి: పల్లెటూరి అమ్మాయిగా జబర్దస్త్ వర్ష ఎద్దులబండి మీద ఊరంతా తిరుగుతూ ఎంజాయ్​

ఏదో కోల్పోతున్నట్లు అనిపిస్తోంది.. ఇక సినిమాలు చేయను!: ఆమిర్​ ఖాన్​ అనూహ్య నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.