ETV Bharat / entertainment

నటి శ్రీలీల తల్లిపై పోలీస్ కేసు నమోదు.. ఫిర్యాదు చేసింది ఆయనే - నటి శ్రీలీల సినిమాలు

పెళ్లి సందిడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి శ్రీలీల తల్లిపై పోలీస్ కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. అసలు ఏమైందంటే?

actress Sreeleela
actress Sreeleela
author img

By

Published : Oct 5, 2022, 5:18 PM IST

తెలుగు దిగ్గజ డైరక్టర్​ కే రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లి సందడి' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. తాజాగా ఈ అమ్మడు తల్లి, స్వర్ణలతపై కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు.
శ్రీలీల తండ్రి సుభాకర్ రావు ఫిర్యాదు మేరకు.. ఆమె తల్లిపై అడుగోడి పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. సుభాకర్ రావు, స్వర్ణలత గత 20 ఏళ్లుగా విడిగా జీవిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిద్దరి విడాకుల పిటిషన్​పై కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే అక్టోబర్​ 3న కొరమంగళలో ఉన్న తన అపార్ట్​మెంట్​​లోకి స్వర్ణలత తాళం పగులగొట్టి వెళ్లిందని సుభాకర్​ రావు ఆరోపించారు. దీనిపైనే తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

actress Sreeleela
తల్లితో నటి శ్రీలీల

కాగా, స్వర్ణలతపై మరో కేసు కూడా ఉంది. అలియన్స్​ యూనివర్సిటీ కాంట్రవర్సీలో అనేకల్ పోలీస్ స్టేషన్​లో ఏ2గా కేసు నమోదైంది. ప్రస్తుతం స్వర్ణలత బెయిల్​పై ఉంది. అయితే ఈ కేసులో తదపరి విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: గ్లామర్​ డోస్​ పెంచిన యాంకర్​ శ్రీముఖి.. గ్రీన్ డ్రెస్​లో స్పెషల్​ ఫొటోషూట్!

RAPO 20: రామ్​తో శ్రీలీల రొమాన్స్​.. బోయపాటి మాస్​ యాక్షన్​ షురూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.