ETV Bharat / entertainment

ఫీల్​గుడ్​గా 'పంచతంత్రం' ట్రైలర్​.. కీలక పాత్రలో బ్రహ్మానందం - బ్రహ్మానందం పంచతంత్ర ట్రైలర్​

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కీలకపాత్రలో స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పంచతంత్రం'. హర్ష పులిపాక దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు.

bramhanandam panchatantram trailer
ఫీల్​గుడ్​గా 'పంచతంత్రం' ట్రైలర్​.. కీలక పాత్రలో బ్రహ్మానందం
author img

By

Published : Nov 26, 2022, 5:18 PM IST

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల జోరు మరింత పెరిగింది. ఎలాంటి అంచనాలు లేకుండా వస్తున్న సినిమాలు, కంటెంట్ ఉంటే చాలు ఆడియన్స్​కు కనెక్ట్ అవుతున్నాయి. చిన్న సినిమాగా వచ్చి, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటున్నాయి. అలా ఈ సారి థియేటర్స్​కు రానున్న మరో చిన్న సినిమానే 'పంచతంత్రం'. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కీలకపాత్రలో నటించారు. స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు. హర్ష పులిపాక దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర ట్రైలర్​ను హీరోయిన్ రష్మిక చేతుల మీదగా విడుదల చేశారు.

ఐదు కుటుంబాలు.. ఐదు జీవితాల సమాహారంగా ఈ కథ నడుస్తుందనే విషయం ఈ ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. నిత్యం జీవితంలో మనకు ఎదురయ్యే ఎన్నో కథలను ఆధారంగా చేసుకుని ఈ ఫీల్‌ గుడ్‌ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్రబృందం చెబుతోంది. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్‌, సృజన్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'చిరంజీవి ఉండగా సల్మాన్ అలా చేయడం నచ్చలేదు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.