ETV Bharat / entertainment

క్రికెట్​ ఆడుతూ ప్రముఖ నటుడు కన్నుమూత - Deepesh Bhan

ప్రముఖ బుల్లితెర నటుడు, కమెడియన్‌ దీపేశ్​ భాన్‌ కన్నుమూశారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కవితా కౌశిక్‌.. దీపేశ్ మరణ వార్తను ధ్రువీకరించారు.

Bhabiji Ghar Par Hai actor Deepesh Bhan passes away
దీపేశ్​ భాన్‌
author img

By

Published : Jul 23, 2022, 2:10 PM IST

Updated : Jul 23, 2022, 2:15 PM IST

సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటుడు, కమెడియన్‌ దీపేశ్​ భాన్‌ కన్నుమూశారు. దీపేశ్​ భాన్‌ మృతి చెందిన విషయాన్ని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కవితా కౌశిక్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.
క్రికెట్‌ ఆడుతూ.. ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో స్నేహితులు ఆయనను హుటాహుటిన దగ్గర్లోని తరలించారు. అయితే అప్పటికే దీపేశ్​ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

దీపేశ్​ ఆకస్మిక మరణంతో టెలివిజన్ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దీపేశ్​ మృతి పట్ల పలువురు సినీ, టీవీ నటీనటులు సంతాపం ప్రకటిస్తున్నారు. దీపేశ్​ చాలా ఫిట్‌గా ఉంటారని, మద్యపానం, పొగతాగే అలవాట్లు ఆయనకు లేవన్నారు కవితా కౌశిక్​. అతనికి భార్య, కొడుకు ఉన్నారు. 'కాగా ‘భాబీ జీ ఘర్‌ పర్‌ హై' అనే సీరియల్‌తో పాటు 'కామెడీ కా కింగ్‌ ఖాన్‌', 'కామెడీ క్లబ్‌', 'భూత్‌వాలా', 'ఎఫ్‌ఐఆర్‌', 'ఛాంప్‌' వంటి షోలతో ఆయన మంచి గుర్తింపు పొందారు.

ఇదీ చదవండి: రూ.199 చెప్పులతో 'లైగ‌ర్' ట్రైల‌ర్ లాంచ్​కు హాజరైన విజయ్​.. రణ్​వీర్​ పొగడ్తలు

Last Updated : Jul 23, 2022, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.