ETV Bharat / entertainment

ఆ సినిమాలో పాటగా బాలయ్య కవిత.. టైటిల్​గా చిరు డైలాగ్ - ఆ సినిమాలో పాటగా బాలయ్య కవిత

నందమూరి నటసింహం బాలకృష్ణ.. అటు తెరపై.. ఇటు బయట.. ఏం చేసినా, ఏం చెప్పినా డిఫరెంట్​గానే ఉంటుంది. దాని గురించే అంతా మాట్లాడుకుంటుంటారు. అప్పుడప్పుడూ అవి సోషల్​మీడియాలో విపరీతంగా వైరల్ కూడా అవుతుంటాయి. అలా ఆయన గతంలో చెప్పిన ఓ కవిత ప్రస్తుతం మళ్లీ తెగ ట్రెండ్​ అవుతోంది. ఎందుకంటే దాన్ని ఓ సినిమాలో పాటగా రూపొందించారు. అంతేకాదు ఆ చిత్రానికి మెగాస్టార్​ చిరంజీవి చెప్పిన డైలాగ్​నే టైటిల్​గా పెట్టారు. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే.. ​

Balakrishna kavita as song in Like share and subscribe movie
ఆ సినిమాలో పాటగా బాలయ్య కవిత.. టైటిల్​గా చిరు డైలాగ్
author img

By

Published : Oct 26, 2022, 6:28 PM IST

'లగ్తాహైకి ఆస్మాన్‌ సే ఫరిస్తా ఉతర్‌కే సంగ్‌మే మరమరాన్‌మే బనాలేంగే.. హర్‌ ఖలీ మస్తే ఖాబ్​ హో జాతిహై.. పత్తీ పత్తీ గులాబ్‌ హోజాతీ హై'... దీని అర్థం తెలియకపోయినా దాదాపుగా చాలా మంది దీన్ని వినే ఉంటారు. ఎందుకంటే ఇది మన బాలయ్య నోటి నుంచి జారిన కవిత. జూనియర్​ ఎన్టీఆర్​ నటించిన అరవింద సమేత సినిమా సక్సెస్​ మీట్​లో హీరోయిన్​ పూజాహెగ్డేను అభివర్ణిస్తూ చెప్పారాయన. అది అప్పుడు ఎంతగా ఫేమస్​ అయిందో అందరికీ తెలిసిందే. సోషల్​మీడియాలో ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ అయింది.

అయితే ఇప్పుడా కవిత మళ్లీ సోషల్​మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే.. సాధారణంగా చిన్న సినిమాలపై ప్రేక్షకుల్లో హైప్, ఆసక్తిని పెంచడానికి.. తమ చిత్రాల్లో భిన్నమైన ప్రయోగాలు చేస్తుంటారు మన హీరోలు దర్శకులు. అలా కొన్ని సందర్భాల్లో మరో హీరో చెప్పిన డైలాగ్స్​​, వాళ్ల సాంగ్స్​ను లేదా సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయిన వాటిని.. తాజా చిత్రాల్లో రీక్రియేట్​ చేసి ఉపయోగించేస్తారు. అలా ఈ సారి బాలయ్య చెప్పిన 'పత్తీ పత్తీ గులాబ్​ హోజాతీ' కవితను ఉపయోగించారు. ఎందులో అంటే.. యంగ్ హీరో సంతోష్​ శోభన్​ నటించిన తాజా చిత్రం 'లైక్​ షేర్​ అండ్ సబ్​స్రైబ్​'. ఈ మూవీ నవంబరు 4న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన అప్డేట్స్​ను రిలీజ్​ చేస్తూ.. అందులో భాగంగానే ఓ సాంగ్​ను విడుదల చేశారు. ఆ పాటే 'పత్తీ పత్తీ గులాబ్ హోజాతీ'. ఈ లైన్​తో మొదలైన ఆ లవ్​ సాంగ్​ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. నెట్టింట్లో మంచి వ్యూస్​తో దూసుకెళ్తోంది. దీంతో ఆ పాటను, బాలయ్య చెప్పిన కవితను రెండింటిని జోడించి ఫ్యాన్స్​ సోషల్​మీడియాలో ట్రెండ్ చేసేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇకపోతే ఆ సినిమా టైటిల్​ కూడా ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. ఎందుకంటే.. రీసెంట్​గా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' టీజర్​ విడుదలైంది. ఆద్యంతం అదిరిపోయే బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​తో పవర్​ఫుల్​గా ఉన్న ఆ టీజర్​ చివర్లో చిరు ఓ డైలాగ్​తో కేక పుట్టించారు. అదేంటంటే.. 'ఇలాంటి ఎంటర్​టైన్మెంట్​ ధమాకా ఇంకా చూడాలంటే.. లైక్​ షేర్​ అండ్ సబ్​స్క్రైబ్​'. నిజానికి ఈ డైలాగ్​ కన్నా మందే సంతోష్​ సినిమాకు ఆ టైటిల్​ను ఖరారు చేశారు. కానీ చిరు ఆ డైలాగ్​ చెప్పడంతో.. అందరికీ సంతోష్​ శోభన్​ సినిమాకు కనెక్ట్​ అయింది. ఆ సినిమా ప్రమోషన్స్​కు బాగా ప్లస్​ అయింది.

.
.

కాగా, 'లైక్ షేర్ అండ్​ సబ్​స్క్రైబ్' సినిమా రిలీజ్​ డేట్ దగ్గర పడటంతో..​ మూవీటీమ్​ ప్రమోషన్స్​లో జోరుగా పాల్గొంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సుమ క్యాష్ షోకు విచ్చేసి సందడి చేశారు. హీరో శోభన్​, హీరోయిన్​ ఫరియా అబ్దుల్లా, నటుడు బ్రహ్మాజీ.. యాంకర్​ సుమతో కలిసి అదిరిపోయే కామెడీ పంచ్​లు వేస్తూ తెగ నవ్వులు పూయించారు. ముఖ్యంగా బ్రహ్మాజీ 'కమ్​ టు మై రూమ్​' అంటూ కామెడీ డైలాగ్​తో ఫుల్​గా కితకితలు పెట్టించేశారు.

ఇదీ చూడండి: కత్రినకు అలాంటి సినిమాలు చేయాలని ఉందట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.