ETV Bharat / entertainment

టైటానిక్​ హీరోయిన్​ సాహసం.. అవతార్​ 2 కోసం నీటిలో 7 నిమిషాలు ఊపిరి తీసుకోకుండా.. - అవతార్ 2 కేన్​ విన్స్​లెట్​

అవతార్​ 2 సినిమా షూటింగ్​ సమయంలో తాను ఎదుర్కొన్న ఓ అనుభవాన్ని తెలిపింది హాలీవుడ్ స్టార్ హీరోయిన్​ కేన్​ విన్స్​లెట్​. ఓ సీన్ కోసం తాను దాదాపు 7 నిమిషాల 15 సెకన్ల పాటు ఊపిరి తీసుకోలేదని పేర్కొంది.

Avatar 2 Kate Winslet
టైటానిక్​ హీరోయిన్​ సాహసం.. ఆ సీన్ కోసం నీటిలో 7 నిమిషాలు ఊపిరి తీసుకోకుండా..
author img

By

Published : Dec 16, 2022, 3:02 PM IST

సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అవతార్ 2' సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా 52 వేలకుపైగా స్క్రీన్స్​లో ఈ చిత్రం గ్రాండ్ విడుదలైంది. అయితే ఈ క్రమంలోనే ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హాలీవుడ్​ నటి కేట్ విన్స్​లెట్​ ఈ చిత్రం షూటింగ్​లో తాను ఎదుర్కొన్న ఓ అనుభవాన్ని తెలిపింది. ఓ సీన్ కోసం తాను దాదాపు 7 నిమిషాల 15 సెకన్ల పాటు ఊపిరి తీసుకోలేదని పేర్కొంది. దీంతో ఆమె హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ రికార్డ్​ బ్రేక్ చేసినట్టైంది. మిషన్ ఇంపాజిబుల్.. రోగ్ నేషన్​ సెట్​లో టామ్ దాదాపు ఆరు నిమిషాల పాటు ఊపిరి తీసుకోకుండా ఉన్నారు.

అవతార్​ 2 కోసం నీటి అడుగున షూటింగ్ చేస్తున్నప్పుడు ఎంతో ఒత్తిడి భరించానని.. ఆ సమయంలో తాను చనిపోయానని అనుకుని అరిచానని.. ఇందుకు సంబంధించిన వీడియో తన వద్ద ఉన్నట్లు చెప్పుకొచ్చింది విన్స్​లెట్​. చివరగా 7 నిమిషాల 15 సెకన్లు ఊపిరి తీసుకోకుండా ఉండడం చూసి తనను తాను నమ్మకలేకపోయానని వెల్లడించింది.

కాగా, లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 2 సినిమాలో కేట్.. రోనల్ అనే పాత్రలో కనిపించింది. 1997లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన టైటానిక్ సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో విన్స్​లెట్​ నటించింది.

ఇదీ చూడండి: అవతార్​ 2 మూవీ హీరోయిన్​ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.