ETV Bharat / entertainment

మళ్లీ రిలీజ్‌ కానున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'... తారక్​తో సినిమాపై అనిల్​ రావిపూడి క్లారిటీ - అమెరికాలో ఆర్​ఆర్​ఆర్​

ఎన్టీఆర్​తో సినిమా చేసే విషయమై స్పష్టతనిచ్చారు దర్శకుడు అనిల్​ రావిపూడి. మరోవైపు 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా మరోసారి విడుదలకు సిద్ధమైంది. ఆ వివరాలు..

anil ravipudi ntr movie
అనిల్ రావిపూడి తారక్​ సినిమా
author img

By

Published : May 18, 2022, 7:53 PM IST

Anilravipudi NTR cinema: ప్రముఖ దర్శకుడు అనిల్​ రావిపూడి నుంచి రాబోయే సినిమాల గురించి ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే బాలయ్యతో ఓ సినిమా చేయబోతున్న ఆయన.. ఎన్టీఆర్​తోనూ మూవీ చేస్తారని కథనాలు వచ్చాయి. తాజాగా 'ఎఫ్​ 3' ప్రమోషన్స్​లో పాల్గొన్న అనిల్​.. తారక్​తో సినిమాపై క్లారిటీ ఇచ్చారు. "ఇవన్నీ పుకార్లు మాత్రమే. ఇప్పటివరకు ఏది ఫైనలైజ్​ కాలేదు. బాలకృష్ణతో మాత్రం సినిమా ఉంటుంది. సెప్టెంబరు నుంచి ప్రారంభమవుతుంది. ఇక తారక్​తో టచ్​లో ఉన్నాను. ఆయనకు ఎలాంటి లైన్​ చెప్పలేదు. ప్రస్తుతం నా దృష్టంతా 'ఎఫ్3' పైనే ఉంది.. ఆ తర్వాత బాలయ్య మూవీపై ఫోకస్​ చేస్తా" అని అన్నారు. కాగా, వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'ఎఫ్3' మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

RRR Uncut Version: ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్‌'. పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. ఈ సినిమా ఇప్పుడు అమెరికాలో మరోసారి విడుదలకు సిద్ధమైంది. జూన్‌ 1న అమెరికాలోని వంద థియేటర్లలో మళ్లీ రిలీజ్‌ అవ్వనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది. అయితే ఈ సినిమాను కేవలం ఒక్కరోజు మాత్రమే థియేటర్లలో ప్రదర్శిస్తారు. స్పెషల్‌ స్క్రీనింగ్‌ పేరుతో సినిమాలోని తొలగించిన సన్నివేశాలను యథాతథంగా ఉంచి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ అన్‌కట్‌ వెర్షన్‌ సినిమాను చూడటం కోసం టిక్కెట్లను అందుబాటులోకి తీసుకురాగా.. అవి వేగంగా అమ్ముడయ్యాయట. మరి ఈ స్పెషల్‌ స్క్రీనింగ్‌ సందడి ఎలా ఉంటుందో చూడాలి.

ఇదీ చూడండి: ఆది పెళ్లిలో నాని​ హంగామా.. సాంగ్​తో 'మేజర్​', 'గాడ్సే' రిలీజ్​ డేట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.