ETV Bharat / entertainment

బన్నీ దాతృత్వం.. తండ్రిని కోల్పోయిన నర్సింగ్ విద్యార్థికి అండగా.. అభినందించిన కలెక్టర్​ - అల్లు అర్జున్​ మంచి మనసు

ఐకాన్​ స్టార్ అల్లుఅర్జున్​ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఓ పేద విద్యార్థిని చదివించేందుకు ముందుకు వచ్చారు. తన చదువుకు అయ్యే పూర్తి ఖర్చును భరిస్తానని హామి ఇచ్చారు.

alluarjun helped kerala girl
తండ్రిని కోల్పోయిన నర్సింగ్ విద్యార్థికి అండగా ఐకాన్​ స్టార్
author img

By

Published : Nov 11, 2022, 1:26 PM IST

Updated : Nov 11, 2022, 1:44 PM IST

మనం చేసే పనిలో మంచి ఉండాలిగానీ... మనిషి కనిపించాల్సిన అవసరం లేదు.. ఇది ఓ సినిమాలో ఐకాన్​స్టార్​ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్‌. నిజ జీవితంలోనూ బన్నీ దీన్ని పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 'పుష్ప' సక్సెస్​తో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. సేవాగుణంలో కూడా ముందుంటారని నిరూపించుకుంటున్నారు. ఓ పేద విద్యార్థినిని చదివించడానికి ముందుకు వచ్చి తన మంచి మనసును చాటుకున్నారు. దీంతో అభిమానుల మన్నలనను అందుకుంటున్నారు.

ఇదీ కథ.. కేరళలోని అలెప్పీలో ఓ ముస్లిం నర్సింగ్ విద్యార్థిని చదువుకు అవసరమయ్యే ఖర్చు మొత్తాన్ని భరించేందుకు సిద్ధమయ్యారు అల్లు అర్జున్​. ఈ విషయాన్ని అక్కడి తెలుగు తేజం, జిల్లా కలెక్టర్​ వీ ఆర్ కృష్ణ తేజ తన ఫేస్​బుక్​ పోస్ట్​ ద్వారా తెలిపారు. అయితే సాయం అందుకున్న ఆ అమ్మాయి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు.

"ఓ ముస్లిం అమ్మాయి తాను చదువుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని కోరింది. ఆమెకు ప్లస్​ 2లో పరీక్షల్లో 92 శాతం మార్కులు వచ్చాయి. అయితే గతేడాది ఆ విద్యార్థిని తండ్రి కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఆమె కళ్లలో ఆత్మవిశ్వాసం కనిపించింది్. అందుకు 'వి ఆర్​ ఫర్ అలెప్పీ ప్రాజెక్ట్​' ద్వారా ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందులో భాగంగానే టాలీవుడ్​ యాక్టర్​ అల్లుఅర్జున్​కు ఈ విషయాన్ని తెలియజేశాం. వెంటనే సాయం చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. మూడేళ్ల పాటు కాలేజీ, హాస్టల్​కు సంబంధించిన పూర్తి ఖర్చును భరిచేందుకు అంగీకరించారు. ఆ అమ్మాయి తప్పకుండా భవిష్యత్​లో నర్స్​ అవుతుంది. తన కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది. అలాగే సమాజం కోసం కూడా మంచి చేస్తుంది" అని కలెక్టర్ అన్నారు.

వినూత్న సేవాకార్యక్రమాలతో ఓ సంచలనం.. 2018 కేరళలో వరదలు వచ్చినప్పుడు లక్షలాదిమంది నిరాశ్రులయ్యారు. దీంతో 'ఆపరేషన్ కుట్టనాడ్​' ద్వారా ఎంతో మందిని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు తెలుగు తేజం మైలవరపు కృష్ణ తేజ. ఈ ప్ర‌జా ఐఏఎస్ ఆఫీస‌ర్ కేర‌ళ‌లో ఒక సంచ‌ల‌నం. విన్నూత ఆలోచ‌న విధానాల‌తో వివిధ సేవ‌కార్య‌క్ర‌మాల్లో ముంద‌డుగులో ఉంటారు. ఏ జిల్లాలో ప‌నిచేసిన ఆ జిల్లా ప్ర‌జ‌ల మ‌న‌స్సులో చిర‌స్థాయిగా ఉండేలా ప‌నిచేయ‌డం ఈయ‌న నైజం. విప‌త్క‌ర‌ ప‌రిస్థితిల్లో ఈయ‌న తీసుకునే నిర్ణ‌యాలు ఆశ్చ‌ర్యం కలిగించేలా ఉంటాయ్‌. ఈ క్రమంలోనే ఆయన ఆపరేషన్ కుట్టనాడ్​ తర్వాత 'వి ఆర్ ఫర్ అలెప్పీ' పేరుతోనూ సామాజిక సేవా కార్యక్రమాల్ని చేస్తున్నారు. పేదలకు సాయం చేస్తున్నారు. దీనికి ఎంతో మంది ప్రముఖులు విరాళాలు కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లుఅర్జున్​ కూడా నర్సింగ్ విద్యార్థిని చదివించేందుకు ముందుకు వచ్చారు.

కాగా, అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో మంచి ఫాలోయింగ్ ఉంది. తరచూ కేరళ ప్రజలతో బన్నీ టచ్‌లో ఉంటారు. అక్కడి అభిమానులు ముద్దుగా బన్నీని మల్లు అర్జన్​ అని పిలుచుకుంటారు. గతంలో కేరళప్రభుత్వం ఆహ్వానం మేరకు అక్కడి బోట్ ఫెస్టివల్‌కు బన్నీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఇదీ చూడండి: నటి పూర్ణ సర్​ప్రైజ్​ తొలిరోజే భర్త చేసిన ఆ పనితో

Last Updated : Nov 11, 2022, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.