ETV Bharat / entertainment

చిరంజీవి ఫ్యామిలీతో 'గొడవల'పై అల్లు అరవింద్​ క్లారిటీ! - అలీతో సరదాగా షో

మెగాస్టార్​ చిరంజీవి ఫ్యామిలీతో వచ్చిన గొడవల​పై దర్శకుడు అల్లు అరవింద్​ క్లారిటీ ఇచ్చారు. అలీతో సరదాగా షోకు.. ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన పలు విశేషాలను తెలిపారు. ఇంతకీ ఏమన్నారంటే..

allu aravind gives clarity
allu aravind gives clarity
author img

By

Published : Oct 5, 2022, 3:39 PM IST

తెలుగు సినిమా రంగంలో చెప్పుకోదగ్గ నిర్మాతలలో ఆయన ఒకరు. తెలుగు ప్రేక్షకులకు సూపర్​ హిట్​ చిత్రాలు అందించారు. ఆయనే అల్లు అరవింద్​. తాజాగా ఈ నిర్మాత.. ఈటీవీలో ప్రసారమయ్యే అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. అల్లు క్వీన్​ ఆర్హ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. చిన్న వయసులోనే ఇంత తెలివైన అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారని అన్నారు. తండ్రి అల్లు రామ లింగయ్యపై తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

'మీ తండ్రి మిమ్మల్ని తెలివైన వాడని ఎప్పుడు అనుకున్నారు' అని అలీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అల్లు అరవింద్. తన తండ్రి రెమ్యునరేషన్ విషయంలో తలెత్తిన ఓ సమస్యను తీర్చానని చెప్పారు. అల్లు రామలింగయ్యకు ముందుగా అనుకున్న రెమ్యునరేషన్​ కంటే తక్కువగా ఇచ్చారట. దీంతో రామలింగయ్య.. అరవింద్​ను ఓ సలహా అడిగితే.. ఈ డబ్బులు మీ వద్దే ఉంచుకుని.. సినిమా అయిపోయిన తర్వాత వడ్డీతో సహా ఇవ్వమని సలహా ఇచ్చారట అరవింద్​. దీంతో ఆ మొత్తం డబ్బులు ఇచ్చారట.

అయితే ఓ సందర్భంలో హోస్ట్​ అలీ.. అల్లు అరవింద్​ను ఓ కాంట్రవర్సీ ప్రశ్న అడిగారు. మీరు ముందుగా ఇలాంటి ప్రశ్నలు అడగరని చెప్పారు.. ఇప్పుడు అడుగుతున్నారని అలీని ప్రశ్నించారు అరవింద్​. అనంతరం ఆ ప్రశ్నపై​ స్పందించారు. మెగాస్టార్​ చింరజీవి ఫ్యామిలీతో ఉన్న డిస్టర్బెన్స్‌​పై క్లారిటీ ఇచ్చారు. అయితే, ఆయన ఏం చెప్పారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఆలోపు అలీతో సరదాగా ప్రోమో చూసేయండి..

.

ఇవీ చదవండి: బ్లూ సారీలో 'బేబమ్మ'.. వామ్మో ఇలా మారిపోయిందేంటి!!

RAPO 20: రామ్​తో శ్రీలీల రొమాన్స్​.. బోయపాటి మాస్​ యాక్షన్​ షురూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.