ETV Bharat / entertainment

'అప్పుడు చైన్​.. ఇప్పుడు కత్తి.. మిగతాదంతా సేమ్​ టూ సేమ్​' - ది ఘోస్ట్‌ మూవీ రిలీజ్ డేట్​

టాలీవుడ్​ 'మన్మథుడు' నాగార్జున నటించిన చిత్రం 'ది ఘోస్ట్‌'​. ఈ సినిమా ప్రీ రిలీజ్​ వేడుక ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. గతంలో శివ సినిమా అక్టోబర్ 5న రిలీజ్​ అయ్యిందని చెప్పారు. ఇప్పుడు 'ది ఘోస్ట్‌' కూడా అదే రోజు వస్తోందని చెప్పుకొచ్చారు.

the ghost pre release event
the ghost pre release event
author img

By

Published : Sep 26, 2022, 6:52 AM IST

నన్ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో 'ది ఘోస్ట్‌'లో అలాగే కనిపిస్తా. చాలా కష్టపడి చేశాం. ప్రేక్షకులంతా చూసి ఆదరిస్తారనే గొప్ప నమ్మకంతో ఉన్నాం" అన్నారు అక్కినేని నాగార్జున. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'ది ఘోస్ట్‌'. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించారు. నారాయణ్‌దాస్‌ నారంగ్‌, పూస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. దసరా సందర్భంగా అక్టోబరు 5న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఈ సందర్భంగా ఆదివారం రాత్రి కర్నూలులో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. నాగచైతన్య, అఖిల్‌ ఈ వేడుకలో సందడి చేశారు. నాగార్జున మాట్లాడుతూ "33 ఏళ్ల కిందట అక్టోబరు 5న 'శివ' అనే ఒక కుటుంబ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అప్పుడు చైన్‌ చేతపట్టుకుని వచ్చాను. అదే అక్టోబరు 5న కత్తి పట్టుకుని వస్తున్నాను. ఇది కూడా ఓ కుటుంబ వినోదాత్మక చిత్రమే. విజయదశమి అందరికీ విజయాన్నిస్తుందని చెబుతారు. ఈ పండగ మాకు కూడా విజయాన్నిస్తుందని నమ్ముతున్నా.

'ది ఘోస్ట్‌' తీసిన దర్శకుడు ప్రవీణ్‌ సత్తారుకి యాక్షన్‌, డ్రామా అంటే ఇష్టం. ఆ రెండింటినీ కలిపి ఈ సినిమా తీశారు. నాకు, కథానాయిక సోనాల్‌కి శిక్షణ ఇప్పించి మరీ ఈ సినిమా చేశారు. ఈ ఏడాది ఆరంభంలో నాగచైతన్యతో కలిసి 'బంగార్రాజు'తో ప్రేక్షకుల ముందుకొచ్చా. అది థియేటర్లలో చక్కటి ఆదరణ పొందింది. ఓటీటీ, టెలివిజన్లలో రికార్డులు సృష్టించింది.

దానికి వచ్చిన ఆదరణ ఈ ఏడాది ఏ సినిమాకీ రాలేదు. త్వరలో అఖిల్‌తో కలిసి నటిస్తున్నా. 'అన్నమయ్య' సినిమా సమయంలో కర్నూలుకి వచ్చాను. మళ్లీ ఇప్పుడు రావడం ఆనందంగా ఉంది. నాకెంతో ఆప్తులైన చిరంజీవి సినిమా కూడా దసరాకి విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలకి విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అన్నారు.

  • అఖిల్‌ మాట్లాడుతూ "నాన్నకి సినిమాపై ప్యాషన్‌, ఆకలి తగ్గదా అని నేను, అన్నయ్య మాట్లాడుకున్నాం. 30 ఏళ్ల తర్వాత కూడా అదే క్రమశిక్షణతో పనిచేస్తున్నారాయన. మాకు ధైర్యం, స్ఫూర్తి మా ఇంట్లోనే ఉందని అర్థమైంది. మేం ఎంత పరిగెత్తాలో నాన్న చూపిస్తున్నారు. ‘ది ఘోస్ట్‌’ ప్రేక్షకులంతా ఆస్వాదించేలా ఉంటుందీ చిత్రం" అన్నారు.
  • ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ "అంచనాల్ని అందుకునేలా ఉంటుందీ చిత్రం. నాగార్జునని ఎలా చూసి పెరిగానో అలాంటి గాఢమైన లుక్స్‌తో ఆయన్ని తెరపై చూపించాను. చిత్రబృందం చక్కటి సహకారం అందించింది" అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌తోపాటు చిత్రబృందం కృష్ణ మాదినేని, విక్రమాదిత్య, ముఖేష్‌, ధర్మేంద్ర, బ్రహ్మ కడలి, సీవీ రావు, భరత్‌, సౌరభ్‌, మార్క్‌ కె.రాబిన్‌ తదితరులు పాల్గొన్నారు.
  • నాగచైతన్య మాట్లాడుతూ "నాన్నతో, అఖిల్‌తో కలిసి అభిమానుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. వారంలో మూడు నాలుగుసార్లు నాన్నని కలుస్తూ ఉంటాను. ఆయన ఐదు, పది నిమిషాలు తన పని గురించి మాట్లాడుతుంటారు. గత నాలుగైదు నెలలుగా ఎప్పుడు కలిసినా 'ది ఘోస్ట్‌' సినిమా గురించే మాట్లాడారు. ఒక సినిమా గురించి ఇలాంటి ఉత్సాహం నాన్నలో చూసి చాలా రోజులైంది. నాన్నని స్టైలిష్‌, యాక్షన్‌ సినిమాలో చూడటానికి నేను ఇష్టపడతాను. అలాంటి సినిమానే తీశారు ప్రవీణ్‌ సత్తారు" అన్నారు.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి : 'అలా జరుగుతుందని అసలు ఊహించలేదు.. ఓ రకంగా అది మంచిదే'

కెరీర్​లో అలా చేయడం ఇదే ఫస్ట్​ టైమ్​.. సూపర్​ స్ట్రాంగ్​గా నయన్!​: చిరంజీవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.