Adipurush Ranbir Kapoor : రామాయణం ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్' కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులతోపాటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరో వారంలో థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐదు ప్రధాన భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా రిలీజ్‌కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది.
రణ్‌బీర్ మంచి మనసు..
ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ఆశ్యర్యపరిచే నిర్ణయం తీసుకున్నారు. ఆదిపురుష్ చిత్రం ప్రతి ఒక్కరూ చూడాలాన్న లక్ష్యంతో తనవంతుగా ఏకంగా 10 వేల టికెట్లు కొనుగోలు చేయనున్నారు. ఓ ఎన్జీవో సంస్థ ద్వారా ఆ టికెట్లను పేద పిల్లల ఇవ్వనున్నారని తెలిసింది. వారందరికీ హిందూ పురాణాలపై అవగాహన కల్పించాలనే ఆయన ఈ నిర్ణయం తీసుుకున్నట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయంతో రణ్‌బీర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు హీరో ప్రభాస్ రాముడిగా నటించినప్పటికీ.. బాలీవుడ్ స్టార్ టికెట్లు కొనడం ఆసక్తికరంగా మారింది.
'కశ్మీర్ ఫైల్స్' నిర్మాత కూడా
మరోవైపు, 'కార్తికేయ-2', 'కశ్మీర్ ఫైల్స్' వంటి సూపర్ హిట్ చిత్రాల ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదిపురుష్ సినిమా టికెట్లను 10వేల మందికిపైగా ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి మాత్రమే టికెట్లు ఉచితంగా అందివ్వనున్నారు.
-
Come, lets immerse in a divine cinematic experience with #Adipurush 🙏🏻
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) June 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
10,000+ tickets would be given to all the Government schools, Orphanages & Old Age Homes across Telangana for free by Mr. @AbhishekOfficl
Fill the Google form with your details to avail the tickets.… pic.twitter.com/vnkNTLX2H1
">Come, lets immerse in a divine cinematic experience with #Adipurush 🙏🏻
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) June 7, 2023
10,000+ tickets would be given to all the Government schools, Orphanages & Old Age Homes across Telangana for free by Mr. @AbhishekOfficl
Fill the Google form with your details to avail the tickets.… pic.twitter.com/vnkNTLX2H1Come, lets immerse in a divine cinematic experience with #Adipurush 🙏🏻
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) June 7, 2023
10,000+ tickets would be given to all the Government schools, Orphanages & Old Age Homes across Telangana for free by Mr. @AbhishekOfficl
Fill the Google form with your details to avail the tickets.… pic.twitter.com/vnkNTLX2H1
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారిని ఓ గూగుల్ ఫామ్‌ను పూర్తి చేయాల్సిందిగా కోరారు. సంబంధిత వివరాలు నమోదు చేస్తే తాము టికెట్లు పంపిస్తామని అభిషేక్ అగర్వాల్ తెలిపారు. సందేహాలకు 95050 34567 నంబరుకు ఫోన్ చేయొచ్చన్నారు. "ఈ జూన్‌లో అత్యంత గొప్ప వ్యక్తి మర్యాద పురుషోత్తముని స్మరించుకుందాం. ఆదిపురుష్ వేడుకలు చేసుకుందాం. శ్రీరాముడి ప్రతి అధ్యాయం మానవాళికి ఒక పాఠం. ఈతరం ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన దివ్య అడుగుజాడలను అనుసరించాలి" అని విజ్ఞప్తి చేశారు.
రామాయణాన్ని ఆధారంగా చేసుకుని భారీ బడ్జెట్‌తో 3డీలో దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన చిత్రమిది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా ఆదిపురుష్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U సర్టిఫికెట్ పొందింది. సీతారాములుగా ప్రభాస్ - కృతి సనన్ నటించగా.. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవ్ దత్త హన్మంతుడిగా అలరించబోతున్నారు. సైఫ్ అలీఖాన్ రావణసురుడి పాత్రను పోషించారు. జూన్ 16న ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి ముందు చిత్ర బృందం.. ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్లలో ఒక సీటును విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్టు ప్రకటించడం విశేషం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">