Actor With No Box Office Clash : 2023 ఏడాదికిగాను అటు నార్త్‌తో పాటు ఇటు సౌత్‌లోనూ ఎన్నో సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందులో భారీ నుంచి చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే పండుగ సీజన్‌తో పాటు వీకెండ్స్‌ను దృష్టిలో ఉంచుకుని దర్శక నిర్మాతలు సినిమా రిలీజ్ డేట్స్‌ను ఫిక్స్ చేస్తారు. కొన్ని సార్లు అవి మిగతా చిత్రాల విడుదల తేదీలతో క్లాష్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
తాజాగా బాలకృష్ణ 'భగవంత్ కేసరి', విజయ్ 'లియో' దసరా సందర్భంగా ఒకే సారి పోటీ పడగా.. ఈ ఏడాది చివర్లో రానున్న షారుక్ ఖాన్ 'డంకీ', ప్రభాస్ 'సలార్' కూడా క్రిస్మస్ పండుగ సమయానికి ఇదే తరహాలో బరిలోకి దిగనుంది. మరోవైపు రణ్‌బీర్ కపూర్ 'యానిమల్' అలాగే విక్కీ కౌశల్ 'శామ్ బహాదుర్' కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి. ఇలా ఏదో ఒక సినిమా మరోకదానితో పోటీ పడుతూనే ఉంటుంది.
అయితే ఇప్పటి వరకు ఎటువంటి క్లాష్ లేకుండా సోలోగానే థియేటర్లలోకి వచ్చి సందడి చేసిన స్టార్ ఒకరున్నారు. ఆయన సినిమా విడుదలకు సిద్ధంగా ఉందంటే ఇక మిగతా వారంతా తమ రిలీజ్ డేట్స్‌ను మార్చుకోవాల్సిందే! అలా గత 13 ఏళ్లుగా ఈ స్టార్ హీరో సింగిల్‌గా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. ఇంతకీ ఆయనెవరో కాదు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. తాజాగా ఆయన లీడ్ రోల్లో తెరకెక్కిన 'టైగర్ 3' కూడా సోలోగానే థియేటర్లలో విడుదల కానుంది. దీపావళి కానుకగా ఈ ఏడాది నవంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమాకు కాంపిటిషన్‌గా ఏ ఒక్క సినిమా కూడా థియేటర్లలోకి రాకపోవడం గమనార్హం.
Salman Khan Movies List : 2010లో విడుదలైన 'దబాంగ్' నుంచి ఇప్పటివరకు సుమారు 16 సినిమాలు క్లాష్ లేకుండా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అందులో 'బాడీగార్డ్', 'ఏక్ థా టైగర్', 'దబాంగ్ 2', 'జై హో', 'కిక్', 'బజరంగీ భాయిజాన్', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'సుల్తాన్', 'ట్యూబ్‌లైట్', 'టైగర్ జిందా హై', 'రేస్ 3', 'భారత్', 'దబాంగ్ 3', 'కిసీకా భాయ్ కిసికీ జాన్' లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. అయితే 'ట్యూబ్‌లైట్' , 'కిసీ కా భాయ్ కిసికీ జాన్'.. ఈ రెండు సినిమాలు తప్ప మిగతావన్నీ సూపర్ హిట్ టాక్ అందుకున్నవే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
స్టార్ హీరో కాదు.. కానీ ఈ యాక్టర్ చివరి మూడు సినిమాల కలెక్షన్లు రూ.1900 కోట్లు!