సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమై రెండేళ్లు ప్రేమించుకున్నారు. కానీ పెళ్లి చేసుకునేందుకు ఆ యువకుడు నిరాకరిస్తున్నారని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఖమ్మంలో ఆ బాధిత యువతి వివరాలు వెల్లడించింది.
ఖమ్మం జిల్లాకు చెందిన ఆ యువతి బీ ఫార్మసీ చివరి సంవత్సరం చదువుతోంది. రెండేళ్ల క్రితం ఇన్‌స్టా గ్రామ్‌లో ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నోవాతో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనను శారీరకంగా లోబరుచుకున్నాడని ఆమె పేర్కొంది.
ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడని కన్నీటి పర్యంతమైంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. ఇలాంటి పరిస్థితి మిగతా అమ్మాయిలకు రావద్దొని కోరుకుంటోంది.
ఇదీ చూడండి : యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది