ETV Bharat / crime

Gun Firing Case in Telangana: కర్ణంగూడ జంట హత్యల నిందితుల కోసం గాలింపు

Gun Firing Case: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కర్ణంగూడ వద్ద జరిగిన జంటహత్యల కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

author img

By

Published : Mar 7, 2022, 9:43 AM IST

Gun Firing Case in Telangana
కర్ణంగూడ జంట హత్యల నిందితుల కోసం గాలింపు

Gun Firing Case: తెలంగాణలోని ఇబ్రహీంపట్నం కర్ణంగూడ వద్ద జరిగిన జంటహత్యల కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 25 ఎకరాలపై భూవివాదం ఏడాదిగా శ్రీనివాస్‌రెడ్డి, మట్టారెడ్డి మధ్య నడుస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 13న మట్టారెడ్డికి శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి మధ్య గొడవ జరిగింది. అప్పటికే మట్టారెడ్డిపై శ్రీనివాస్‌రెడ్డి నుంచి ఒత్తిడి పెరగడంతో తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన మట్టారెడ్డి వారి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. పథకం ప్రకారమే జంట హత్యలు చేయించినట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు.

భూవివాదంలో పోలీసు అధికారుల ప్రమేయంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం వ్యవహారంపై సీనియర్‌ అధికారి నేతృత్వంలో అంతర్గత విచారణ సాగుతోంది. ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ విజయ్‌, కానిస్టేబుల్‌ బాలకృష్ణను అంబర్‌పేట్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయి విచారణ నివేదిక ఆధారంగా సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

ఈనెల 1న కాల్పులు...

ఈనెల 1న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ సమీపంలో ఉదయం అదుపుతప్పి ప్రమాదానికి గురైన స్కార్పియో వాహనాన్ని స్థానికులు గమనించారు. కారుపై రక్తపు మరకలు ఉండటం.. వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లటాన్ని గమనించి మొదట రోడ్డు ప్రమాదంగా భావించారు. కానీ వాహనంలో బుల్లెట్ గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని గుర్తించి... పోలీసులకు సమాచారమిచ్చారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వ్యక్తిని హైదరాబాద్‌ బీఎన్​రెడ్డిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం.. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తున్న క్రమంలోనే కొంత దూరంలో అప్పటికే కాల్పుల్లో మృతిచెందిన వ్యక్తిని గుర్తించారు. కారు వద్ద లభ్యమైన ఆధారాలు... గాయపడిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో విచారణ జరిపిన పోలీసులు.... మృతుడు అల్మాస్‌గూడకు చెందిన శ్రీనివాస్‌రెడ్డిగా.. గాయపడింది రాఘవేందర్‌రెడ్డిగా గుర్తించారు.

ఇదీ చూడండి:

Telangana Realtors Murder Case: స్థిరాస్తి వ్యాపారులపై కాల్పుల కేసులో ఆరుగురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.