హైదరాబాద్‌లో దారుణం జరిగింది. భర్తతో గొడవలు భరించలేక కత్తితో పొడిచి హత్య చేసింది భార్య. అనంతరం ఆమె పోలీసులకు లొంగిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సాయి కృష్ణానగర్‌లో జరిగింది.
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం బూసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బూసిరెడ్డి మురళీధర్ రెడ్డి, మౌనిక దంపతులు. వీరిద్దరు ఉద్యోగరీత్యా సరూర్‌నగర్ సాయికృష్ణానగర్ కాలనీలో నివాసముంటున్నారు. మురళీధర్ రెడ్డి హైటెక్ సిటీలోని ఒక హార్డ్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. మౌనిక మరో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఈ నెల 6వ తేదీన మౌనిక బీఏ తృతీయ సంవత్సరం పరీక్షలు రాయడానికి గుంటూరు జిల్లాలోని గురజాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. అనంతరం ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న కత్తితో మురళీధర్ రెడ్డిని పొడిచి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మహిళను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: