Wife tried to kill her husband: నెల్లూరు రూరల్ మండలం సౌత్‌మోపూరు వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తుండగా భర్త గొంతును భార్య కోసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడిని స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. సౌత్ మోపూర్‌కు చెందిన ప్రసన్న కుమార్, లక్ష్మీ ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇదివరకే వివాహమై.. ఇద్దరు పిల్లలున్న లక్ష్మీప్రసన్న వారిని వదిలేసి ప్రసన్నకుమార్‌ను వివాహం చేసుకుంది.
వీరికి ఓ కుమారుడు పుట్టగా.. ఇటీవల తనను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ భర్తపై కక్ష పెంచుకుంది. నెల్లూరు నుంచి బైక్‌పై సౌత్ మోపూరుకు వెళ్తుండగా మొగళ్లపాళెం స్టేడియం సమీపంలో చాకుతో భర్త గొంతు కోసింది. గుర్తించిన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు లక్ష్మీ ప్రసన్నను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవీ చదవండి: