ATTACK: వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం గంగవరంలో గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ సహనం కోల్పోయాడు. వైఎస్ఆర్ బీమా రెన్యూవల్ చేయమని అడిగిన ఓ వ్యక్తిపై దాడి చేశాడు. గ్రామానికి చెందిన కామనూరు చిన్ననాగయ్య.. వైఎస్సార్ బీమా రెన్యువల్ చేయాలంటూ..గ్రామ సచివాలయానికి వెళ్లారు. వెల్ఫేర్ అసిస్టెంట్ చంద్రను.. బీమా రెన్యూవల్ చేయాలని కోరారు. దీనికి దురుసుగా సమాధానం చెప్పిన వెల్ఫేర్ అసిస్టెంట్ ఆ తర్వాత తీవ్ర పదజాలంతో దూషించాడని బాధితుడు వాపోయారు. ఈ క్రమంలోనే వెల్ఫేర్ అసిస్టెంట్ చంద్ర తన చేతికున్న కడియంతో తలపైన బలంగా కొట్టడం వల్ల గాయపడినట్లు నాగయ్య చెప్పారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందిన బాధితుడు..దాడి చేసిన వెల్ఫేర్ అసిస్టెంట్ చంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: