ETV Bharat / crime

వార్డు వాలంటీర్‌ ఆత్మహత్య.. వైసీపీ నేత వేధింపులే కారణమంటూ సూసైడ్​ నోట్ - వైసీపీ ఎమ్మెల్యే

Suicide
ఆత్మహత్య
author img

By

Published : Jan 9, 2023, 9:11 AM IST

Updated : Jan 9, 2023, 1:00 PM IST

09:03 January 09

ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న శరవణ

Ward Volunteer Commit To Suicide : ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న చిత్తూరు వార్డు వాలంటీర్​ శరవణ బంధువులు రాస్తారోకో నిర్వహించారు. శరవణ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దానిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మృతుని బంధువులు ఆరోపించారు. చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ఈ ధర్నాలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాస్తారోకో నిర్వహిస్తున్న బంధువులను పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తూ శరవణ దాదాపు 40 లక్షల వరకు మోసపోయాడని అతని బంధువులు ఆరోపించారు. తీసుకున్న వారు తిరిగి ఇవ్వలేదని.. పైగా బెదిరింపులకు పాల్పడ్డారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల బెదిరింపలకు తాళలేక శరవణ ఉరి వేసుకుని మృతి చెందడాని అతని బంధువులు పేర్కొన్నారు.

చిత్తూరు నగరంలోని 11వ డివిజన్‌ పరిధిలోని జోగుల కాలనీకి చెందిన శరవణ.. సయ్యద్​ అనే వ్యక్తి వేధింపుల కారణంగానే చనిపోతున్నానని లేఖ రాశారు. అందులో సయ్యద్​ అనే వ్యక్తికి 8 లక్షల 20 వేల రూపాయలు అప్పుగా ఇవ్వగా.. అతను తిరిగి ఇవ్వటం లేదని పేర్కొన్నాడు. తిరిగి ఇవ్వమని అడిగినందుకు కుటుంబసభ్యులను ఏమైనా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని లేఖలో తెలిపాడు. ఎమ్మెల్యే మనిషినని నన్ను ఏమి చేయలేవని సయ్యద్​ బెదిరించేవాడని శరవణ లేఖలో పేర్కొన్నాడు. ఇతనే కాక ఇంకా మరికొందరు తనకు బాకీ ఉన్నారని లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 9, 2023, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.