ETV Bharat / crime

వృద్ధ దంపతులను సైలెంట్ గా చంపేశాడు.. పోలీసులు వాసన పట్టారుగా! - విజయవాడ వృద్ధ దంపతుల హత్యకేసు

విజయవాడలో నాలుగు రోజుల క్రితం సంచలనం సృష్టించిన వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరినీ చంపేసి సైలెంట్ గా తిరుగుతున్న నిందితుడిని పట్టేశారు! ఇంతకీ ఎవరా నిందితుడు? ఎలా చంపేశాడు?? ఎందుకీ దారుణానికి ఒడిగట్టాడు???

murder
murder
author img

By

Published : Aug 10, 2022, 5:01 PM IST

Updated : Aug 10, 2022, 5:43 PM IST

హత్య ఎవరు చేయొచ్చు..?
ప్రత్యర్థులు చేయొచ్చు..
ఇంకా..?
దోపిడీ దొంగలు చేయొచ్చు..
ఇంకా..
ఇంకా.. సంఘవిద్రోహులంతా చేయొచ్చు..
ఇంకా..?
ఇంకా.. ఇంకెవరుంటారు??
మనవాడే చేయొచ్చు.. బంధువే రాబంధువూ కావొచ్చు..
లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా??
ఉంది.. విజయవాడ నగరంలో జరిగింది..

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతం అది.. ఈనెల 5వ తేదీ.. గడియారం ఉదయపు 7 గంటలు కొట్టి చాలా సేపవుతోంది.. 8 కూడా దాటింది..! కానీ.. రోజూ 6 గంటలకన్నా ముందే నిద్రలేచే కొండయ్య, పైడమ్మ దంపతులు ఇంకా లేవలేదు. తలుపు కూడా తెరవలేదు. ఊరుకేమైనా వెళ్లారా.. అంటే లేదు. నిన్న రాత్రి మనకు కనిపించారుగా?! ఏమైంది.. అనుకుంటూ వెళ్లి తలుపు కొట్టారు చుట్టు పక్కలవాళ్లు. చప్పుడు లేదు. కిటికీలోంచి తొంగి చూశారు. 65 ఏళ్ల కొండయ్య.. 60 ఏళ్ల పైడమ్మ ఇంట్లోనే ఉన్నారు.. కానీ.. ఎంత పిలిచినా ఇద్దరిలో కదలిక లేదు. మనసు కీడు శంకించింది.

ఇదేదో తేడా వ్యవహారంలా అనిపించి, వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిమిషాల్లో వాలిపోయారు. లోనికి వెళ్లి చూస్తే.. ఇద్దరి ప్రాణం పోయి చాలా సమయమే అవుతోందని అర్థమవుతోంది. ఎవరైనా కొట్టి చంపారా?.. లేదా మరో విధంగా ప్రాణాలు తీశారా? తెలియట్లేదు. ఆనవాళ్లేవీ కనిపించట్లేదు. అయితే.. వృద్ధులకు రోజు మద్యం తాగే అలవాటు ఉందని.. అది కూడా నాణ్యతలేని తక్కువ ధర మందు తాగుతారని.. ఒక్కోసారి సర్జికల్ స్పిరిట్ కూడా తీసుకుంటారని స్థానికులు ఎవరో చెప్పారు. ఇలాంటి.. వివరాలన్నీ సేకరించిన పోలీసులు.. కేసు రిజిస్టర్ చేశారు.

కేసు నమోదైంది గానీ.. ఏం జరిగి ఉంటుంది? పోలీసుల దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఇక్కడే పోలీసు బుర్రకు పదును పెట్టారు. ఎలాంటి క్రైమ్ లో అయినా సరే.. ఫస్ట్ లాజికల్ పాయింట్ ఒకటి ఉంటుంది. మొదటి సాక్షిగా ఉన్న వ్యక్తే.. మొదటి నిందితుడు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదే పద్ధతిలో.. హంతకుడు బయటివాడు అని తేలకపోతే.. నిందితుడు ఇంట్లోనే ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈ వృద్ధ దంపతుల విషయంలోనూ పోలీసులు ఇదే విధంగా ఆలోచించారు. ఇంట్లో దొంగతనం ఏమీ జరగలేదు.. కాబట్టి ఈ హత్య దొంగల పని కాదు. ప్రత్యర్థులు వచ్చి దాడిసినట్టుగా ఆధారాలేమీ కనిపించట్లేదు. అనారోగ్యంతో చనిపోయారని అనుకోవడానికి.. ఇద్దరూ ఒకే రోజు కాలం చేస్తారా? సమ్ థింగ్ ఈజ్ రాంగ్.. పోలీసు ఆలోచనలో వేగం పెరిగింది.

ఇంటి నుంచే కేసును తవ్వడం మొదలు పెట్టారు. వృద్ధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులను కొంత కాలంగా పెద్ద కూతురే సాకుతోంది. విచారణలో తీగ తగిలేలా కనిపిస్తోంది. ఇంకా లోతుగా తవ్వడం మొదలు పెట్టారు.. తమను పెద్ద కూతురే చూస్తోంది కాబట్టి.. ఉన్న ఆస్తి కూడా తన పేరునే రాస్తానని అన్నారట దంపతులు. వెంటనే గేరు మార్చిన పోలీసులు.. కుటుంబ సభ్యులు అందరినీ విచారించారు. ఎవరికి తెలిసింది వారు చెప్పారు. కానీ.. ఒక వ్యక్తి ప్రవర్తన తేడా కొడుతోంది. అడిగిన ప్రశ్నలకు తడబడుతున్నాడు. పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. ఏంటీ సంగతి అంటే.. నీళ్లు నములుతున్నాడు.. సరిగ్గా సమాధానం చెప్పాలని గద్దించడంతో మొత్తం కక్కేశాడు.

అతని పేరు రంజాన్. కొండయ్య, పైడమ్మ చిన్న అల్లుడు. అవును.. చిన్న కూతురి భర్తే..! ఆస్తి పెద్ద కూతురికి రాస్తానని అనడంతో కోపం తెచ్చుకున్నాడు.. అది ద్వేషంగా మారింది.. వాళ్లను అంతం చేస్తేనే తన మనస్సుకు శాంతి అనుకున్నాడు. ఆస్తిలో వాటా అనుకున్నాడు. కానీ.. ఎలా..? ఏం చేసినా.. తన మీదకు రాకుండా చూసుకోవాలని ప్లాన్ వేశాడు. బుర్రలో క్రిమినల్ ఐడియాలను వేసి రుబ్బగా.. రుబ్బగా.. ఓ మెరుపులాంటి ఔట్ పుట్ వచ్చింది. ఎలాగో ముసలి వాళ్లు.. పైగా పిచ్చి మద్యం తాగుతుంటారు.. దాని అకౌంట్లో వేసేస్తే సరి, నింద మందు మీదకు.. ఆస్తిలో వాటా తనకు.. అనుకున్నాడు. ప్లాన్ ప్రకారం.. మోతాదుకు మించిన స్పిరిట్ తాగించాడు. అలా.. ఇద్దరినీ హత్యచేసి సహజ మరణం లేదా.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

ఈ వివరాలన్నీ నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. ఆ విధంగా.. విజయవాడలోని వృద్ధ దంపతులది సాధారణ మరణం కాదని.. పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్య అని తేల్చారు. సొంత అల్లుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఇవీ చదవండి :
భార్య బుగ్గ కొరికిన భర్త.. కేసు నమోదు చేసిన పోలీసులు
ఎస్సై అభ్యర్థిని.. కోమాలోకి పంపారు!

Last Updated : Aug 10, 2022, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.