చిత్తూరు జిల్లా మదనపల్లి గ్రామీణ మండలం పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వలసపల్లి - పుంగనూరు రోడ్డులో రాత్రి ద్విచక్ర వాహనాన్ని మినీ లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులను మదనపల్లి గ్రామీణ మండలం అంకి శెట్టిపల్లి పంచాయతీ గాంధీపురానికి చెందిన శ్రీకాంత్, భాను ప్రకాష్ అలియాస్ రాజుగా పోలీసులు గుర్తించారు.
భాను అక్కడికక్కడే..
ప్రమాదంలో భాను ప్రకాష్ అక్కడికక్కడే మరణించగా.. చికిత్స నిమిత్తం శ్రీకాంత్‌ను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.
ఇవీ చూడండి : వీడిన మిస్టరీ... కన్నతల్లే హంతకురాలు