ETV Bharat / crime

Two girls missing: వాగులో వరద ఉద్ధృతి.. ఇద్దరు యువతులు గల్లంతు - వాగులో పడి ఇద్దరు యువతులు గల్లంతు

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో వాగులో పడి ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. ద్విచక్రవాహనంపై ముగ్గరు వెళ్తుండగా.. వాగు ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో బైకు కిందపడి ఇద్దరు కొట్టుకుపోయారు.

wo young women were abducted
వాగులో పడి ఇద్దరు యువతులు గల్లంతు
author img

By

Published : Aug 30, 2021, 6:50 PM IST

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కుర్రారం వద్ద.... వాగులో పడి ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. యాదగిరిగుట్ట నుంచి రాజపేట మండలం బొందుగులకు గ్రామంలో ఓ ఫంక్షన్​కు ఓ యువకుడు, ఇద్దరు యువతులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా దోసలవాగు ఉద్ధృతిలో బైక్ మీది నుంచి పడిపోయారు. ముగ్గురు చేతులు పట్టుకొని నెమ్మదిగా వచ్చే ప్రయత్నంచేశారు. కానీ నీటి ఉద్ధృతికి సింధూజ(24), బిందు(14) కొట్టుకుపోయారు. వీరిలో సింధూజ మృతదేహం లభించగా.. బిందు కోసం గాలిస్తున్నారు. మృతురాలు జనగామ జిల్లా చిన్నకోడూరు వాసిగా గుర్తించారు.

ఇద్దరు యువతులు, ఓ అబ్బాయి బండిపై వస్తున్నారు. వాగు మధ్యలోకి వచ్చేసరికి బండి ఆగిపోయింది. వాగు ప్రవాహానికి కింద పడిపోయారు. అబ్బాయి ఒకవైపు, అమ్మాయిలో మరోవైపు పడిపోయారు. బండి కొట్టుకుపోయింది. పడిపోయినవారంతా ఎలాగోలా పైకి లేచారు. ముగ్గురు ఒకరికొకరు చేతులు పట్టుకుని కొంతదూరం వచ్చారు. ఇంతలో ఓ అమ్మాయి కాలు జారిపోయింది. కిందపడిపోయిన ఆమె.. మరో అమ్మాయి కాలు పట్టుకుంది. ఇద్దరు చూస్తుండగానే కొట్టుకుపోయారు. - స్థానికుడు

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.