తెలంగాణ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చౌదరి చెరువులో దూకి ఇద్దరు మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం రాత్రి ఏడుగంటల సమయంలో ఇద్దరు చెరువులో దూకినట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
తాళ్లగడ్డ వైపు ఉన్న చెరువు కట్టపై మెట్ల వద్ద రెండు జతల మహిళల చెప్పులు ఉండటంతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఇదే సమయంలో ఓ మహిళ మృతదేహం నీటిపైకి తేలింది. గజా ఈతగాళ్లను రప్పించిన పోలీసులు మృతదేహాన్ని తీస్తుండగా చేతులకు కట్టుకుని ఉన్న మరో యువతి మృతదేహం లభ్యమైంది. వారి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: