Deers Dead at Aluru: కర్నూలు జిల్లా ఆలూరు పట్టణ సమీపంలోని రహదారిపై రెండు జింకలు మృతి చెందాయి. ఆలూరు సమీపంలోని 132 కేవీ విద్యుత్ సమీపంలోని 167 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన జింకలను పరిశీలించారు.
అయితే.. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక.. మరేదైనా కారణమా? అని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. మృత్యువాత పడ్డ జింకలను శవ పంచనామా కోసం పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం దర్యాప్తు చేపడుతామని ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మీకు తెలుసా..? శాస్త్రాలు మనుషులకే కాదు కోళ్లకూ ఉన్నాయి...!