ETV Bharat / crime

ప్రకాశం జిల్లాలో తుఫాన్​ దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం - ఏపీ తాజా వార్తలు

TOOFAN VEHICLE BURNT : ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కనిగిరి నుంచి నర్సరావుపేటకు వెళ్తున్న వాహనంలో దర్శి మండలం వెంకటాచలంపల్లి వద్ద ఇంజన్​లో నుంచి పొగలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్​ ప్రయాణికులను కిందకు దించారు.

TOOFAN VEHICLE BURNT
TOOFAN VEHICLE BURNT
author img

By

Published : Oct 2, 2022, 3:48 PM IST

TOOFAN VEHICLE : ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లి వద్ద తుఫాన్ వాహనం దగ్ధమైంది. కనిగిరి నుంచి నర్సరావుపేటకు 8 మంది పెద్దలు ఐదుగురు చిన్నారులతో వెళ్తున్న వాహనం దర్శి మండలం వెంకటాచలంపల్లి గ్రామం వద్దకు వచ్చేసరికి ఇంజన్‌లో పొగలు వచ్చాయి. ఇది గమనించిన డ్రైవరు వెంటనే వాహనాన్ని ఆపి ప్రయాణికులను కిందకు దింపాడు. ఆ తర్వాత బానెట్ తెరవబోతుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కళ్ల ముందే వాహనం కాలిపోయింది. ప్రాణహాని లేకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రకాశం జిల్లాలో తుఫాన్​ దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.