ETV Bharat / crime

ap crime news : వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి.. పలువురు అరెస్టు - వివాహిత ఆత్మహత్య

ap crime news : రాష్ట్రంలో జరిగిన వివిధ ఘటనల్లో నలుగురు మృతి చెందారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని.., చిట్టీల పేరుతో పలుపురు మోసాలకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి.

ap crime news
ap crime news
author img

By

Published : Feb 16, 2022, 5:08 PM IST

ap crime news :రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. మరికొన్ని ఘటనల్లో పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

దారి ఇవ్వలేదని దారుణం

దారి ఇవ్వలేదని ముందు వెళ్తున్న ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న వ్యక్తిపై మరో ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తి దాడి చేశాడు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించేలోపే ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది. మృతుడు గుర్రాల చావడి ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్ ఖాన్(36)గా గుర్తించారు. ఘటనకు కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ విజయ భాస్కర్ తెలిపారు.

కారు కాలువలోకి దూసుకెళ్లి..

కారు కాలువలోకి దూసుకెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన రేపల్లె మండలంలో జరిగింది.మృతుడు రేపల్లె పట్టణం 2వ వార్డుకు చెందిన నసీం బాషా (23)గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒంటరితనాన్ని భరించలేక మహిళ ఆత్మహత్య ..

ఒంటరితనాన్ని భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన తెనాలి పట్టణంలో జరిగింది. మృతురాలు భాగ్యలక్ష్మి (43)గా గుర్తించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని ఒక సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్యకు పాల్పడింది.

ఉద్యోగాలు ఇప్పిస్తానని ...

రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని విశాఖ రెండో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. కంచరపాలెం ప్రాంతం సంతోష్ నగర్​కు చెందిన పిల్లి నాగరాజు(33) పెందుర్తి, ఎస్. కోట ప్రాంతాలకు చెందిన కొంత మంది యువతను నమ్మించి.. రూ.40 లక్షలు వసూలు చేశాడు. అనంతరం నకిలీ ఉద్యోగ గుర్తింపు కార్డులు అందజేసి.. పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని నాగరాజును మంగళవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

కత్తితో దాడి..

కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం బలపాలపల్లె గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడిపై వేణుగోపాల్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాజేష్​ను... కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు. దాడికి గల కారణాలను పోలీసులు ఆరాతీస్తున్నారు.

సినిమా చూసి.. హత్యలు, దొంగతనాలు..

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఒంటరి మహిళలే లక్ష్యంగా దాడులు చేసి చోరీలకు పాల్పడిన షేక్ షఫీఉల్లాను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 58గ్రాముల బంగారు ఆభరణాలు, 97వేలు నగదు, హత్యకు ఉపయోగించిన ఇనుపరాడు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు.... జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. దండుపాళ్యం సినిమా చూసి ప్రేరేపితమై... హత్యలు, దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

చిట్టీల పేరుతో కుచ్చుటోపీ..

చిట్టీల పేరుతో మోసం చేసిన ఘటన విజయవాడలో జరిగింది. ఎనికేపాడుకు చెందిన సాంబయ్య అనే వ్యక్తి బంధువులు, స్థానికుల నుంచి చిట్టీలో పేరుతో రూ.3 కోట్ల మేర వసూలు చేసి.. కుచ్చుటోపీ పెట్టాడని బాధితులు వాపోయారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వసతి గృహంలో ఉరి వేసుకుని చనిపోయింది. మృతురాలు కొండపల్లి మనూష అంజుగా గుర్తించారు. మృతదేహాన్ని శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు.

ఇదీ చదవండి

Old Women Murder: ప్రకాశం జిల్లాలో వృద్దురాలి హత్య.. ఆస్తి కోసమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.