ETV Bharat / crime

CRIME NEWS: రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాలు..ముగ్గురు మృతి - ఆంధ్రప్రదేశ్ క్రైం న్యూస్

CRIME NEWS: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో పలు ప్రమాదాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మరోవైపు మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఓ మహిళపై దుండగుడు అత్యాచారయత్నం చేశాడు.

CRIME NEWS IN AP
ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు
author img

By

Published : Apr 29, 2022, 1:29 PM IST

Updated : Apr 29, 2022, 9:03 PM IST

బాపట్ల జిల్లా: మండలం చిన్నబేతపూడిలో నాటుసారా స్థావరాలపై ఎస్‌ఈబీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1500 లీటర్ల బెల్లం ఊట, 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.

*సామాజిక మాధ్యమంలో పెట్టిన ఓ పోస్టింగ్ వైకాపాలోని రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఇరువర్గాల వారు పరస్పర దాడులకు దిగడంతో డీఎస్పీ శ్రీకాంత్, సీఐ మల్లికార్జునరావు, రోశయ్యలు వారిని చెదరగొట్టారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

* కొరిసపాడు పాడు మండలం రావినూతల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన పులిపాటి సుబ్బారావు తన పెద్ద కొడుకు మహాలక్ష్మయ్య (39)ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్​కి వెళ్లి లొంగి పోయాడు.

* కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లో పోలీసులు ప్రత్యేక దాడుల్లో భాగంగా 80 లీటర్ల నాటుసారా, దాదాపు 150 కిలోల సారా తయారీకి ఉపయోగించే బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చుండూరు సర్కిల్ సీఐ కళ్యాణ్ రాజు వివరించారు.

* చీరాలలోని రాంనగర్, న్యూ కాలనీల్లో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు చేశారు. సారా తయారీకి సిద్ధంగా ఉన్న సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి...తయారీ సామాగ్రీని, 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.

కర్నూలు జిల్లా: ఆదోని శివారులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న 20 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. లారీని సీజ్ చేసిన పోలీసులు, డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు.

* కర్నూలు సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ అధికారులు భారీగా వెండిని స్వాధీనం చేసుకున్నారు. చెక్ పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా... హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సేలంకి చెందిన రాజు అనే వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా 12 కేజీల వెండి రూ.2.60 లక్షల నగదును సీజ్​ చేశారు.

విజయనగరం జిల్లా: ఎస్.కోట శివారు సీతంపేటలో బాణసంచా తయారు చేస్తుండగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండిళ్లు దగ్ధం కాగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

పల్నాడు జిల్లా: నకరికల్లు మండలం చీమలమర్రులోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో హుండీ పగులగొట్టిన దుండగులు, అందులో ఉన్న కానుకలు ఎత్తుకెళ్లారు. ఈ చోరీపై ఆలయ నిర్వాహకులు నకరికల్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

* కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వరస్వామి వెండి ఏక హారతి చెత్తకుప్పలో దొరికింది. గర్భాలయాన్ని శుభ్రం చేసే క్రమంలో పొరపాటున స్వామివారి వెండి ఏక హారతి చెత్తలో కలిసిపోయి ఉంటుందని ఆలయ ఈవో తెలిపారు.

గుంటూరు జిల్లా: దుగ్గిరాల మండలం తుమ్మపూడి ఘటన మరువక ముందే.. మరో మహిళపై అత్యాచారయత్నం వెలుగుచూసింది. శృంగారపురం గ్రామంలో ఓ మహిళను అత్యాచారం చేసేందుకు పొలంలోకి తీసుకెళ్తుండగా.. భర్త కేకలు వేయడంతో దుండగుడు మహిళను వదిలేసి పరారయ్యాడు. గ్రామంలో మొక్కజొన్న కోసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది కూలీలు వచ్చారు. గ్రామానికి చెందిన యువకుడు పనికోసం వచ్చిన మహిళను అర్థరాత్రి దాటిన తర్వాత పొలంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అది చూసిన భర్తతో పాటు తోటి కూలీలు కేకలు వేయడంతో యువకుడు మహిళను వదిలి పారిపోయాడు. అనంతరం ఘటనపై దుగ్గిరాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కొనాపురం వద్ద ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనంతపురం డివిజన్ బీసీ సంక్షేమ సహాయాధికారిణి రంగమ్మకు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

* కణేకల్ మండలం సీతారాంనగర్ క్యాంప్- బెనికల్ గ్రామాల మధ్య వ్యవసాయ కూలీలతో వెళ్తున్న టాటా ఏసీ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ౩0 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్ణాటకలోని బళ్లారి నగరంలోని విజయనగర మెడికల్ సైన్స్ ప్రధాన వైద్యశాలకు (vims) తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.

శ్రీ సత్య సాయి జిల్లా: మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం కే.కే.పాలెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 10 మంది అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 56 వేల రూపాయల నగదు, 10 మొబైల్ ఫోన్లు, 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

* తలుపుల మండలం బురుజుపల్లిలో మహిళపై ఫీల్డ్ అసిస్టెంట్ దాడి చేశారన్న ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. బురుజుపల్లికి చెందిన వెంకట రమణమ్మ ఇంటికి అడ్డంగా ముళ్ల కంపలు వేసిన ఫీల్డ్ అసిస్టెంట్... దాడి చేసి గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ముళ్లకంపను తొలగించారు. కేసు నమోదు చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనకాపల్లి జిల్లా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో రాత్రి పది గంటలకు అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణాజిల్లా: చెన్నై - కోల్​కతా జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. పొట్టిపాడు టోల్ ప్లాజా సమీపంలో ఎదురుగా వెళ్తున్న లారీని బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన అరిగెల రావీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన జరిగింది.

విజయనగరం జిల్లా: రాజాం పట్టణం కంచారాం గ్రామానికి చెందిన మూగ బాలికపై హరి అనే యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజాం పోలీసులు వెల్లడించారు. యువకుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

నంద్యాల జిల్లా: వైకాపా నాయకుడు సాయినాథ రెడ్డికి... నంద్యాల మూడో పట్టణ పోలీసు స్టేషన్ మహిళా ఎస్సై నగినా ఫొన్ చేసి మాట్లాడారు. బాధితుడి సమస్యను ఫోన్లో వైకాపా నాయకుడికి ఎస్సై చెప్పారు. వీరి మధ్య మాట మాట పెరిగి... ఎస్సైని సాయినాథ రెడ్డి దూషించాడు. మనస్థాపం చెందిన ఎస్సై నగినా అదే స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఎస్సై ఫిర్యాదు మేరకు వైకాపా నాయకుడు సాయినాథ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

ఎన్టీఆర్ జిల్లా: వీరులపాడు మండలం పొన్నవరం గ్రామం శివారులో పోలిసుల తనిఖీల్లో రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పొన్నవరం గ్రామానికి చెందిన కృష్ణ నాగేశ్వరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

వైఎస్ఆర్ జిల్లా: వేంపల్లె మండలం నందిపల్లె సమీపంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న పిజిక్స్ లెక్చరర్ భవాని పులివెందుల నుంచి విధులకు వెళ్తుతుండగా... కారు టైరు పేలి డివైడర్​ను ఢీకొట్టి... ఆవతలి వైపు నుంచి వెళ్తున్న కారుని ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. అటుగా వెళుతున్న వేంపల్లె మండల తెదేపా కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డి ఘటనను చూసి క్షతగాత్రులను హుటాహుటిన వేంపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: Paper leak: పదో తరగతి ఆంగ్లం పేపర్ లీక్​..! 10 గంటలకే వాట్సప్‌లో వైరల్

Last Updated : Apr 29, 2022, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.