ETV Bharat / crime

Crime news: రాష్ట్రంలో పలు చోట్ల ప్రమాదాలు.. ఆరుగురు మృతి!

Crime news: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేర్వేరు ప్రమాదాలు, ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.

Crime news
రాష్ట్రంలో పలు చోట్ల ప్రమాదాలు.. ఆరుగురు మృతి
author img

By

Published : Apr 19, 2022, 3:38 PM IST

Updated : Apr 20, 2022, 2:09 PM IST

నంద్యాల జిల్లా: సాయిబాబానగర్ రహదారిపై ఓ ఎద్దు హల్ చల్ చేసింది. పట్టుకోవడానికి వచ్చిన వారితో పాటు రహదారిపై వెళుతున్న వారిపై వెంటపడింది. స్థానికులు తాళ్లతో ఎద్దును పట్టుకుని నీరు పోశారు. అనంతరం తాళ్లతో పట్టుకొని వెళుతుండగా తప్పించుకుని వెళ్ళింది.

*నందమూరి నగర్​కు చెందిన మన్యం స్వామి అనే వ్యక్తి శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గాయపడ్డ అతడిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఇది జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

*రుద్రవరం మండలం హరినగరం గ్రామంలో పురుగుల మందు తాగి నాగేంద్రమ్మ, ఆమె కూతురు హన్సిక(18) మృతి చెందారు. నాగేంద్రమ్మ శరీరంపై రక్తపు గాయాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని ఎస్సై నిరంజన్​ రెడ్డి తెలిపారు. మృతదేహాలకు పోస్ట్​మార్టం నిర్వహించిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.

కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరులో రాజీవ్ గాంధీ(30) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ద్విచక్ర వాహనాల షో రూం పెట్టి నష్టపోవడంతో.. మనస్తాపం చెంది ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*ఆదోని మండలం కడితోట దగ్గర అంబులెన్సు, ఆటో ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇస్వీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* పంచలింగాల చెక్​పోస్టు వద్ద సెబ్ అధికారులు భారీగా కర్నాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 36 బాక్సులలో ఉన్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సీఐ మంజుల తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి , ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

*ఆదోనిలో చీరల బాక్సులలో అక్రమంగా కర్ణాటక మద్యం రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుల నుంచి 165 మద్యం ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు.

పల్నాడు జిల్లా: బొల్లాపల్లి మండలం అయ్యన్నపాలెంలో రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. ఈ ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

* చిలకలూరిపేట- యడ్లపాడు పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఒక యువకుడు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సిబ్బంది చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. నాదెండ్ల, యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో వ్యవసాయ విద్యుత్ మోటార్లను దొంగిలించే నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 50 మోటార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. వీటి విలువ సుమారు 8 లక్షల రూపాయలు ఉంటుందని ఏసీపీ తెలిపారు.

*హైదరాబాద్‌ సైఫాబాద్‌లోని సిటీటెల్ హోటల్‌లో విజయవాడ వాసి శబరీనాథ్ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అతని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

* సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల ప్రధాన రహదారిపై బైకును బస్సు కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు కంకణాలపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. యువకులు గా సమాచారం.

* విజయవాడ అజిత్ సింగ్​నగర్ వాంబేకాలనీలో ఉరి వేసుకొని ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చిరంజీవి (43) మిద్యానికి బానిసై తరుచు కుటుంబ సభ్యులతో గొడవ పడుతుంటాడని స్ధానికులు తెలిపారు. నున్న గ్రామీణ పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

శ్రీకాకుళం జిల్లా : వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం..

*రణస్థలంలో బాణసంచా పేలి కామరాజు(39) అనే వ్యక్తి మృతి చెందాడు. ఇంటి వద్ద బాణసంచా తయారుచేస్తుండగా ఈ పేలుడు సంభవించింది.

అల్లూరి సీతారామరాజు జిల్లా: వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతి పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 160 కేజీలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేసి, మూడు ఆటోలను సీజ్‌ చేసినట్లు డొంక‌రాయి ఎస్సై న‌ర‌సింహారావు తెలిపారు.

ఏలూరు జిల్లా: ముసునూరు, నూజివీడు మండలాల్లో నాటుసారా స్థావరాలపై ఎస్‌ఈబీ అధికారుల దాడులు చేశారు. 30 లీటర్ల సారా, 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

బాపట్ల జిల్లా: మార్టూరు విద్యానగర్‌లోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు మహిళపై కత్తితో దాడికి యత్నించాడు. మార్టూరు పీఎస్‌లో అర్ధరాత్రి బాధితురాలు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతపురం జిల్లా: ఉరవకొండ పట్టణంలో పట్టపగలే దొంగలు హల్ చల్ చేశారు. బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకొని నారాయణమ్మ అనే వృద్ధురాలు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఇద్దరు దుండగులు డబ్బు సంచి లాక్కొని పరారయ్యారు. వెంటనే పక్కనే ఉన్న ఆటోడ్రైవర్లు అప్రమత్తమై దొంగను పట్టుకునే సమయంలో దొంగ పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళ నుంచి పూర్తి వివరాలు సేకరించారు.

* ఉరవకొండ మండలం లత్తవరం గ్రామం పరిధిలోని హంద్రీనీవా కాలువ గట్టుపై విద్యుత్ వైర్లు తగిలి ఒక ఎద్దు చనిపోగా... మరో ఎద్దుకు తీవ్ర గాయాలయ్యాయి. లత్తవరం నుంచి రైతు ఎద్దుల బండిపై పశువులకు మేతను తీసుకెళ్తుండగా చేతికి అందే ఎత్తులో ఉన్న కరెంట్ తీగలు బండికి తాకాయి. అప్రమత్తమైన రైతు, అతని భార్య వెంటనే కిందకు దుకడంతో ప్రమాదం తప్పింది. వైర్లు ఎత్తు పెంచాలని ఎన్నిసార్లు చెప్పిన విద్యుత్ అధికారులకు పట్టించుకోకపోవడంతో..ట్రాక్టర్​లో మృతి చెందిన ఎద్దును ఉరవకొండ పట్టణంలోని విద్యుత్ కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. అధికారులు ఎవరు లేకపోవడంతో సిబ్బందిని బయటకు పంపి కార్యాలయానికి తాళాలు వేశారు.

ప్రకాశం జిల్లా: గిద్దలూరు మండలం వివేకానంద కాలనీలో కారులో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి కారు దగ్ధమవ్వగా, అందులో ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం

* గిద్దలూరు పట్టణ సమీపంలో అమరావతి- అనంతపురం జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. నంద్యాల నుంచి గిద్దలూరు వైపుకు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కారులో ప్రయాణిస్తున్నవారు అప్రమత్తమై కారు ఆపి వేసి కారులో నుంచి దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. కారు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్టు కారు యజమాని తెలిపారు.

పార్వతీపురం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని కస్పావీధిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు రాళ్లు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు

దారి దోపిడీ: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారి దోపిడీ జరిగింది. వ్యాపారి కళ్లల్లో కారం చల్లి.. దండగులు బంగారం లాక్కెళ్లారు. నగల దుకాణం నుంచి వ్యాపారి ఇంటికి వెళ్తుండగా దారి దోపిడీ జరిగిందన్నారు. 250 గ్రాముల బంగారం లాక్కెళ్లారని వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఎర్రచందనం స్వాధీనం : నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను జాలర్లు గుర్తించారు. మూడు రోజుల క్రితం అధికారులకు సమాచారమిచ్చిన స్పందిచలేదని తెలిపారు. తమ పరిధి కాదని అధికారుల సమాధానమిచ్చారన్నారు. విషయం మీడియాకు తెలియటంతో.. అధికారులు అప్రమత్తమయ్యరన్నారు. అప్పుడు ఘటనాస్థలానికి వెళ్లి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

బాలికపై బాలుడి అత్యాచారం: వట్టిచెరుకూరు మండలంలోని ఓ గ్రామంలో ఐదేళ్ల బాలికపై ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన మంగళవారం ఆలస్యంగా బయటపడింది. పోలీసులు కథనం.. ఈనెల 17న మధ్యాహ్నం గ్రామంలోని కాలనీలో ఒంటరిగా ఉన్న చిన్నారిపై బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు రాకుండా కాలనీ పెద్దలు రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చారు. మంగళవారం ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగడంతో బాధితురాలి తల్లి దీనిపై వట్టిచెరుకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నట్లు ఎస్సై కోటేశ్వరరావు వెల్లడించారు.

ఇదీ చదవండి: Farmers Suicide: అప్పులు తీరవు... ఆకలి ఆగదు.. అందుకే..!

Last Updated : Apr 20, 2022, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.