ETV Bharat / crime

Today Crime In AP: నెల్లూరులో దొంగనోట్ల ముఠా అరెస్ట్.. - ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు

Today Crime In AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేర్వేరు ఘటనలు, ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.

Today Crime In AP
రాష్ట్రంలో పలు ప్రమాదాలు
author img

By

Published : Apr 13, 2022, 5:10 PM IST

Updated : Apr 14, 2022, 1:51 AM IST

దొంగ నోట్లు సరఫరా చేసే ముఠా అరెస్ట్: నెల్లూరు జిల్లా కావలిలో దొంగ నోట్లు సరఫరా చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురిని అరెస్ట్ చేసిన కావలి పోలీసులు వారి నుంచి లక్షా 47 వేల రూపాయల విలువ చేసే దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.

రథోత్సవంలో అపశ్రుతి .. ఒకరు మృతి: కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం మోటూరు గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా నిర్వహించే రథోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. కోదండరామాలయంలో గ్రామస్థులు రథాన్ని లాగుతున్న సమయంలో గరికపాటి వీర వెంకయ్య రథచక్రం కింద పడి మృతి చెందాడు. ఈ ఘటనపై గుడివాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చంద్రగిరి కొత్తపేటలో దొంగల హల్ చల్: తిరుపతి జిల్లా చంద్రగిరి కొత్తపేటలో దొంగలు హల్ చల్ చేశారు. ఒక ప్రైవేటు వైద్యశాలలో ఉన్న మెడికల్ షాప్​లో సుమారు పదిహేను వేల రూపాయలు దోచుకెళ్లినట్లుగా డాక్టర్ సిద్దయ్య తెలిపాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి సీఐ శ్రీనివాసులు సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ శ్రీనివాసులు తెలిపారు.

ఆటోలను దొంగలించే ఇద్దరు వ్యక్తులు అరెస్ట్: విజయవాడ నగర పరిధిలో ఆటోలను దొంగిలించే అంతరాష్ట్ర దొంగలను భవానీపురం పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సయ్యద్ నవాజ్, మహమ్మద్ అలీఫ్​లను అదుపులోకి తీసుకొని వారి నుంచి నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ నగర డీసీపీ బాబురావు తెలిపారు.

బురిడీ బాబా అరెస్ట్: ప్రత్యేక పూజలు చేస్తానని నమ్మించి బురిడీ కొట్టించే కిలాడీ నేరస్తుడిని విజయవాడ నగర కొత్తపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన కోట్ల హరికృష్ణ అలియాస్ నాగరాజు అలియాస్ నూకయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి సుమారు 260 గ్రాముల బంగారం, రూ ఐదు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బాబురావు తెలిపారు.

తొమ్మిది లక్షలతో ఉడాయించిన మెప్మా రిసోర్స్‌ పర్సన్‌: ప్రకాశం జిల్లా కనిగిరిలో రూ.9 లక్షలతో మెప్మా రిసోర్స్‌ పర్సన్‌ ఉడాయించింది. బ్యాంకులో జమచేస్తానని చెప్పి రూ.9 లక్షలతో పారిపోయింది. ఈ ఘటనపై పొదుపు సంఘాల మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వ్యాన్ బోల్తా.. ఖైనీ, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని టోల్ గేట్ వద్ద అర్ధరాత్రి సమయంలో ఓ వ్యాన్ బోల్తా పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం వాహనాన్ని తనిఖీ చేయగా అందులో పదిహేను బస్తాలతో ఖైనీ, గుట్కా ప్యాకెట్లు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గొర్రెలను ఎత్తుకెళ్లే ముగ్గురు దొంగల అరెస్ట్: గొర్రెలను ఎత్తుకెళ్లే ముగ్గురు దొంగలను తాడపత్రి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7 లక్షలు విలువచేసే 65 గొర్రెలు, ఒక స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చైతన్య వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు పంపినట్లు తెలిపారు.

రెండు ఇసుక టిప్పర్లు సీజ్: తిరుపతి జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిపై అధిక లోడుతో వెళ్తున్న రెండు ఇసుక టిప్పర్లను విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల బృందం స్వాధీనం చేసుకున్నారు. లారీలను నాయుడుపేట అగ్ని మాపక కార్యాలయం వద్ద ఉంచడంతో ఇసుక తరలించే వ్యక్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పత్రికా విలేకరులను చిత్రాలు తీయవద్దని దబాయించారు.

మహిళ న్యాయవాది దుర్మరణం : విజయవాజలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తులసీనగర్ వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ న్యాయవాది దుర్మరణం చెందగా..ఆమె భర్తకు గాయాలయ్యాయి. మృతురాలు యలమంచిలి లక్ష్మిగా గుర్తించారు. లక్ష్మి, తన భర్త చంద్రశేఖర్ విజయవాడ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు.

విద్యార్థి ఆత్మహత్య : విశాఖ జిల్లా కంచరపాలెం సుభాష్ నగర్​లో దారుణం జరిగింది. ప్రభుత్వ ఐటీఐలో రెండో ఏడాది చదువుతున్న వినయ్ అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినయ్ ఆత్మహత్యకు ప్రేవ వ్యవహరమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామన్నారు.

ఇదీ చదవండి: కండలేరు జలాశయంలో ముగ్గురు గల్లంతు.. రెండు కుటుంబాల్లో విషాదం

Last Updated : Apr 14, 2022, 1:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.