ETV Bharat / crime

తెలంగాణలో గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు.. కారు సీజ్​ - కచికంటి సమీపంలో గంజాయి స్వాధీనం

గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్​కు కారులో తరలిస్తుండగా గ్రామీణ మండలం కచికంటి సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్​ చేశారు.

three persons arrested and ganjai seized in adilabad rural mandal today
తెలంగాణలో గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు.. కారు సీజ్​
author img

By

Published : Mar 3, 2021, 9:54 AM IST

కర్ణాటక నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్​కు తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రవాణాకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం కచికంటి సమీపంలో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన కారులో సీట్ల కింద భద్రపరచి గంజాయిని తరలిస్తున్నారు. వారి వద్ద నుంచి 60 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్​ చేశారు.

పట్టుబడిన గంజాయి విలువ రూ. 3 లక్షల విలువ కాగా.. బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.20 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠా సభ్యుల్లో ఆదిలాబాద్‌కు చెందిన ఉస్మాన్‌ఖాన్, కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా దడిగికి చెందిన బేలూరే పరమేశ్వర్‌, పర్సన్నే బల్వంత్​ను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలో రూ.72.5 లక్షలు పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.