విశాఖ పోలీసుల ఎదుట ముగ్గురు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. దళంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్న పాంగి జగ్గారావు (31)తో పాటు.. పాంగి ముగిరి అలియాస్ విష్ణు, వంతల నారాయణ అలియాస్ సిద్ధూ వారిలో ఉన్నారు. జగ్గారావుపై.. నాలుగు ఆస్తుల విధ్వంసంతో పాటు మొత్తం 48 కేసులు ఉన్నాయి. 2006 నుంచి దళంలో పని చేస్తూ వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. అగ్రనేత ఆర్కే వంటి వారిని పోలీసుల నుంచి తప్పించటంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
అగ్రనేతలను సురక్షిత ప్రాంతాలకు విడిచి రావడంలో దిట్టగా పేరొందిన జగ్గారావు.. ప్రస్తుతం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. తమకు లొంగిపోయిన మిలిషియా సభ్యుల వివరాలను జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు వెల్లడించారు. దళానికి చెందిన మరో కమాండర్ పాంగి ముగిరి అలియాస్ విష్ణుకు.. ఐదు నేరాలతో సంబంధముందన్నారు. ఏడు నేరాల్లో వంతల నారాయణ అలియాస్ సిద్ధు పాత్ర ఉందని వివరించారు.
ఇదీ చదవండి: