ATTACK: విలాసావంతమైన జీవితాలకు అలవాటుపడి.. సులువుగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో కొందరు దోపిడీలకు పాల్పడుతున్నారు. బంగారం లేక డబ్బుల కోసమో ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడుతున్నారు. ఆ సమయంలో అడ్డువచ్చిన వారిని చంపడానికి కూడా వెనకాడడంలేదు. తాజాగా బాపట్ల జిల్లా అద్దంకిలో కొత్తమాసు హనుమంతరావు, విజయలక్ష్మి అనే వృద్ధ దంపతులపై దుండగుల దాడికి పాల్పడ్డారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. సుమారు 15 సవర్ల బంగారం అపహరించి పరారయ్యారు. గమనించిన స్థానికులు ఆ దంపతులను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హనుమంతురావుుకు తీవ్రగాయాలు కాగా, విజయలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. హనుమంతరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: