ETV Bharat / crime

విద్యార్థినులకు వేధింపులు.. పోలీసుల అదుపులో ఉపాధ్యాయుడు..! - latest crime news in srikakulam

teacher harassment: విద్యార్థులకు మంచి, చెడులు నేర్పించాల్సిన గురువే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. పాఠాలు చెప్పకుండా తరగతి గదిలో నీలిచిత్రాలు చూపిస్తున్నాడు. ఈ ఘటనతో విసుగు చెందిన విద్యార్థులు ఆ ఊరి సర్పంచ్​కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.

teacher harassment
విద్యార్థినులకు వేధింపులు
author img

By

Published : Feb 24, 2022, 2:29 PM IST

students harassment issue: శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గొర్ల భానోజీ రావు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తరగతి గదిలో పాఠాలు చెప్పకుండా తమకు నీలి చిత్రాలు చూపిస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు. తమ శరీరాలు తాకడంతో పాటు నీలి చిత్రాలు చూడాలి అంటూ బలవంతం చేస్తున్నట్లు విద్యార్థినిలు చెబుతున్నారు.

ఈ విషయాన్ని చిన్నారులు గ్రామ సర్పంచ్ నీరజకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సర్పంచ్ నీరజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన ఎస్ఐ గ్రామానికి చేరుకొని విచారించారు. ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి:

chits cheating: చిట్టీల పేరుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఘరానా మోసం.. రూ.6 కోట్లతో పరారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.