హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెలిపై అత్యాచారం జరిగిందనే ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి వెళ్లిన ఆమె.. సూపరింటెండెంట్ రాజారావుతో సమావేశమయ్యారు. అక్కాచెల్లెలి అత్యాచార ఘటన ఆరోపణలపై ఆరా తీశారు.
బాధితురాలితో ఈరోజే మాట్లాడతా..!
బాధితురాలు చెబితే తప్ప ఏం జరిగిందో చెప్పలేమని సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బాధితురాలితో ఇవాళే మాట్లాడతానని తెలిపారు. పూర్తి విచారణ జరిగిన తర్వాతే వాస్తవాలు వెల్లడవుతాయన్న ఆమె.. మరో బాధితురాలు ఎక్కడ ఉందో ఇంకా గుర్తించలేదని వివరించారు. దోషులపై కఠిన చర్యలు ఉంటాయని.. బాధితురాళ్లకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సునీతాలక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.
నిందితుడు దురుసుగా ప్రవర్తించేవాడు..
ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉమామహేశ్వర్ డార్క్‌రూం అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం రేడియాలజీ ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న అతడు... విధులకు సరిగా హాజరు కాకపోగా దురుసుగా ప్రవర్తించేవాడని తోటి ఉద్యోగులు తెలిపారు. ఈనెల 5వ తేదీన బాధితులకు సంబంధించిన వ్యక్తి ఆస్పత్రిలో చేరగా.. 11 వ తేదీన రోగికి డయాలసిస్ చేయాలని వైద్యులు చెప్పారు. రోగి తరఫు వారు డయాలసిస్ వద్దని... ఈనెల 12వ తేదీన ఆస్పత్రి నుంచి వైద్యులకు చెప్పకుండానే వెళ్లిపోయినట్లు సిబ్బంది చెబుతున్నారు. చికిత్స కోసం వచ్చిన రోగి వివరాలు, అతడికి సహాయకులుగా వచ్చినవారి గురించి సునీతా లక్ష్మారెడ్డి ఆరా తీశారు.
ఇదీ చూడండి: