woman raped by SI in Kanyakumari:రక్షణ కల్పించాల్సిన ఎస్సై అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో చోటుచేసుకుంది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై సబ్‌ఇన్‌స్పెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ గర్భం దాల్చగా.. అబార్షన్ కూడా చేయించాడు. ఈ ఘటనలో ఎస్‌ఐతో సహా మరో 8 మందిపై కేసు నమోదైంది.
జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ(32)కు ఓ వ్యక్తితో వివాహమైంది. 9 ఏళ్ల కూతురు కూడా ఉంది. భర్తతో తరచూ వివాదాలు ఏర్పడడం.. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఆ వ్యక్తి తనను మోసగించడంతో పోలీస్ స్టేషన్కు వెళ్లగా.. సబ్‌ఇన్‌స్పెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
తనకు న్యాయం చేయాలని.. డీఎస్పీ, ఎస్పీ ఆఫీస్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:CHEATING IN WEST GODAVARI : చిట్టీల పేరుతో మోసం...రూ.7కోట్లతో పరారీ..!