ETV Bharat / crime

ప్రయాణిస్తున్న బస్సులో నుంచి దూకిన ప్రయాణికుడు.. తీవ్రగాయాలు - krishna distrdict latest news

ప్రయాణిస్తున్న బస్సు నుంచి దూకిన ఓ వ్యక్తి తీవ్రగాయాలపాలైన ఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి ప్రధాన కూడలిలో జరిగింది. బాధితుడు ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Serious injuries to a man who jumped from a bus under the influence of alcohol
బస్సులో నుంచి దూకిన వ్యక్తికి తీవ్రగాయాలు
author img

By

Published : Feb 13, 2021, 8:08 PM IST

కృష్ణా జిల్లా చల్లపల్లి ప్రధాన కూడలిలో ప్రయాణిస్తున్న బస్సు నుంచి ఓ ప్రయాణికుడు కిందికి దూకాడు. ముదినేపల్లి మండలం సంగర్తపురం గ్రామానికి చెందిన మురాల కిరణ్​ ప్రయాణిస్తున్న బస్సులో నుంచి కిందకు దూకడంతో వెనక చక్రం కిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు. రెండు కాళ్లు పూర్తిగా విరిగిపోయి అధికంగా రక్తస్రావమవ్వడంతో చికిత్స కోసం 108 వాహనంలో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బస్సునుంచి దూకిన సమయంలో బాధితుడు మద్యం సేవించి ఉన్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రధానిని కలిశా.. రాష్ట్రంలో జరుగుతున్నదంతా వివరించా: రఘురామ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.