ETV Bharat / crime

Gold seized: ఎయిర్​పోర్టులో బంగారం పట్టివేత... ఫేస్​క్రీమ్ డబ్బాల్లో.. - తెలంగాణ వార్తలు

బంగారం అక్రమ రవాణా అడ్డుకునేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆగడం లేదు. శంషాబాద్‌ కేంద్రంగా అక్రమంగా పసిడి రవాణా వ్యవహారం మరోసారి బయటపడింది. ఫేస్‌క్రీమ్‌ డబ్బాల్లో బంగారం తరలిస్తుండగా కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Gold seized
Gold seized
author img

By

Published : Oct 9, 2021, 5:19 PM IST

శంషాబాద్‌ ఎయిర్​పోర్టులో బంగారం పట్టివేత

హైదరాబాద్​ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడి నుంచి 528 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం(Gold seized) చేసుకున్నారు. దోహా నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానంతో లగేజీ తనిఖీలు చేయగా.. ఫేస్‌ క్రీమ్‌ డబ్బాల్లో బంగారం తీసుకొచ్చినట్లు గుర్తించారు.

ఆ ప్రయాణికుడి నుంచి రూ.20.44లక్షలు విలువ చేసే 528 గ్రాముల బంగారం, 28 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చిన ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు ఎయిర్​పోర్టు డిప్యూటీ కమిషన్‌ బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు.

ఇదీ చదవండి:

Telugu Academy scam: తెలుగు అకాడమీ ఎఫ్‌డీల కేసు.. మరో ముగ్గురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.