Road Accident in Bapatla: బాపట్ల జిల్లా మార్టూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. విజయవాడ సమీపంలోని జి.కొండూరు మండలం కట్టుబడిపాలేనికి చెందిన వెంకటరమణ కుటుంబం.. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో కారు డ్రైవర్ నవీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా ఐదుగురు.. స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
ఇవీ చదవండి: