ROAD ACCIDENT: గుంటూరు జిల్లాలో ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టడంతో ఒక యువకుడు మృతి చెందాడు. మరో యువకుడికి గాయాలయ్యాయి. ఫిరంగిపురం శాంతిపేటకు చెందిన పచ్చల ప్రశాంత్ కుమార్(19), తలకొల ఆర్సెస్ ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై ఫిరంగిపురం నుంచి గుంటూరు వైపు వెళుతున్నారు. అదే సమయంలో గ్రానైట్ రాళ్లు తరలించే టిప్పర్ వెనుక వస్తూ.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. పచ్చల ప్రశాంత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. చికిత్స నిమిత్తం ఆర్సెస్ ను 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉద్దేశపూర్వకంగా లారీతో ఢీకొట్టి ప్రశాంత్ కుమారుని చంపారని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న 108 వాహనం కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోగా.. పోలీసులు అక్కడకు చేరుకుని క్లియర్ చేశారు.
ఇవీ చదవండి: