ETV Bharat / crime

మరో ఐదు రోజుల్లో ఆ యువకుడి పెళ్లి... కానీ అంతలోనే.. - Alluru Crime News

Alluru Road Accident: మరో ఐదు రోజుల్లో ఆ యువకుడి పెళ్లి. ఏడు అడుగుల బంధంతో సరికొత్త జీవితం ప్రారంభించాలనే సంతోషంతో... అన్ని ఏర్పాట్లు చకచకా చేసుకుంటున్నాడు. అందరికి వివాహా ఆహ్వాన పత్రికలు సైతం పంచి పెట్టాడు. కానీ అంతలోనే విధి ఆ యువకుడిని బలి తీసుకుంది. ఇంతకీ అతడు ఎలా మరణించాడంటే...

Alluru Road Accident
Alluru Road Accident
author img

By

Published : Feb 7, 2022, 2:06 PM IST

Alluru Road Accident: కర్నూలు జిల్లా అల్లూరులో విషాదం నెలకొంది. మరో ఐదు రోజుల్లో పెళ్లి పీటలెక్కబోయే యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అల్లూరు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని.. సోమశేఖర్, నాగరాజు అనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సోమశేఖర్‌కు ఈ నెల 12న వివాహం జరగాల్సి ఉంది. మరో మృతుడు నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి మరణంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పెళ్లి పీటలెక్కాల్సిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చదవండి: దంపతుల మధ్య మనస్పర్థలు.. భార్య ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.