ETV Bharat / crime

అలా చేయాలని సీనియర్ల ర్యాగింగ్.. ఎన్​ఎంసీకి విద్యార్థుల ఫిర్యాదు..! - గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్

Raging in guntur medical college: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన సీనియర్‌ విద్యార్థులు.. ర్యాగింగ్​కు పాల్పడుతున్నట్లు యూజీ విద్యార్థులు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. తమను పొడుగు చొక్కాలు ధరించాలని ఆంక్షలు పెడుతున్నారని పేర్కొన్నారు.

Raging in guntur medical college
గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్
author img

By

Published : Mar 18, 2022, 10:52 AM IST

Updated : Mar 18, 2022, 2:15 PM IST

Raging in guntur medical college: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన సీనియర్‌ విద్యార్థులు.. తమను పొడుగు చొక్కాలు ధరించాలని ఆంక్షలు పెడుతున్నారని.. యూజీ విద్యార్థులు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారించి, నివేదిక సమర్పించాలని ప్రిన్సిపల్‌ను ఎన్‌ఎంసీ(NMC) ఆదేశించింది.

ప్రిన్సిపల్‌ ఆచార్య పద్మావతి గురువారం తొలుత కళాశాలలో ర్యాగింగ్‌ కమిటీతో సమావేశం నిర్వహించారు. బాలుర వసతిగృహంలో ఉండే సీనియర్‌ విద్యార్థులు ఇటీవల కొత్తగా చేరిన యూజీ విద్యార్థి ఒకరిని వసతిగృహంలో పొడుగుచొక్కాలు వేసుకోవాలని సూచించటంతో తనను ర్యాగింగ్‌ చేస్తున్నారని భావించి ఆ విద్యార్థి ఎన్‌ఎంసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆ విద్యార్థి ఎవరనే విషయం మాత్రం ఎన్‌ఎంసీ గోప్యంగా ఉంచటంతో విచారణ ఎలా చేపట్టాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు.

ర్యాగింగ్ ఘటనపై స్పందించిన ప్రిన్సిపల్ పద్మావతి..
ఈ నెల 16 న యాంటీ ర్యాగింగ్ కంప్లైంట్ సెల్‌కు ఫిర్యాదు వచ్చిందని.. వైద్య కళాశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి తెలిపారు. అబ్బాయిల వసతిగృహంలో ఘటన జరిగినట్లు ఫిర్యాదు వచ్చిందని.. ఘటనపై యాంటీ ర్యాగింగ్ కమిటీ అప్రమత్తమైందని వివరించారు. మెస్‌లో సీనియర్లు, జూనియర్లు కలవకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.

ర్యాగింగ్ ఘటనపై స్పందించిన ప్రిన్సిపల్ పద్మావతి

విద్యార్థులు ర్యాగింగ్ విషయం మా వద్ద చెప్పటం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మేం మాట్లాడాం. సీనియర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చాం. ర్యాగింగ్ చేయలేదని సీనియర్లు చెబుతున్నారు. విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ సెల్ నంబర్లు ఇచ్చాం. -పద్మావతి, వైద్య కళాశాల ప్రధానోపాధ్యాయురాలు

ఇదీ చదవండి:

వైకాపా కార్యాలయానికి ప్రభుత్వ స్థలం.. లీజు ప్రాతిపదికన ఇష్టారాజ్యం..!

Last Updated : Mar 18, 2022, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.