ETV Bharat / crime

మద్యం, జూదం, సారా, గుట్కా దందాలపై పోలీసుల దాడులు.. నిందితులపై కేసులు

author img

By

Published : Jun 7, 2021, 7:04 AM IST

Updated : Jun 7, 2021, 8:49 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా.. ప్రత్యేక ఎన్​ఫోర్స్​మెంట్ బృందాలు.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. అక్రమ మద్యం, నిషేధిత గుట్కా.. ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, జూదం, నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. చట్ట విరుద్ధ చర్యలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని.. వారిపై కేసులు నమోదు చేశారు.

police rides
police rides

కృష్ణా జిల్లాలో...

  • విజయవాడకు చెందిన నలుగురు యువకులు కర్ఫ్యూ సమయంలో ఆటోలో మద్యం తాగి తిరుగుతుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ఏలూరు రోడ్ చుట్టుగుంట వద్ద అనుమానం వచ్చి పోలీసులు ఆటోను ఆపి తనిఖీ చేయగా.. విషయం బయటపడింది. పట్టుబడిన నలుగురు యువకుల్లో రైల్వే పార్సిల్ సిబ్బంది ఒకరు ఉన్నారు. వారిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • విజయవాడ నగర శివారులో నిషేధిత గుట్కా నిల్వల గోడౌన్ లపై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపుదాడులు చేశారు. ప్రసాదంపాడు జమ్మి చెట్టు బజార్ లో గృహంలో నిల్వ ఉంచిన 2.13 లక్షల రూపాయల విలువైన గుట్కా, సిగరెట్లు.. పటమట కనక దుర్గా నగర్ లో రూ. 2.35 లక్షల విలువైన నిషేదిత గుట్కాలు, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

గుంటూరు జిల్లాలో...

  • తాడేపల్లిలోని మహానాడు ప్రాంతంలో.. పోలీసులు దాడులు నిర్వహించారు. తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. లారీ క్లీనర్ సహాయంతో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించామని సీఐ శేషగిరిరావు తెలిపారు. 117 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
  • చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామంలోని వీవర్స్ కాలనీలో ఓ వ్యక్తి ఇంట్లో నిల్వ ఉంచిన 17 వేల గుట్కా, ఖైనీ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 60 వేలు ఉంటుందనీ ఎస్సై రమేష్ తెలిపారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు.
  • చిలకలూరిపేట పట్టణం పండరీపురం అపార్ట్​మెంట్ లో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై రూరల్ ఎస్పీ ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ బృందాలు ఆదివారం సాయంత్రం దాడులు నిర్వహించాయి. పేకాడుతున్న 33 మంది జూదరులను అరెస్టు చేశారు. రూ. 13.3 8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ప్రకాశం జిల్లాలో...

  • వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు.. ఎస్ఐ కమలాకర్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. 87 క్వార్టర్ బాటిల్స్, 2 ఫుల్ బాటిల్స్, 27 బీర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

కర్నూలు జిల్లాలో...

  • కర్నూలు జిల్లా గూడూరు స్టేషన్ పరిధిలోని సుంకేసుల చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ మద్యం తరలింపును పోలీసులు గుర్తించారు. గూడూరు మండలం మల్లపురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి 1033 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపామని ఎస్సై నాగార్జున తెలిపారు.
  • కోడుమూరు, గూడూరు పట్టణంలో ఆదివారం పోలీసులు విస్తృత దాడులు చేశారు. కోడుమూరుకు చెందిన సజ్జన గాండ్ల దీపక్, షరీఫ్ పాషా నుంచి రూ.1,34,090 విలువచేసే 11,760 నిషేధిత గుట్కా ప్యాకెట్లను ఎస్ఐ వేణుగోపాల్ స్వాధీనం చేసుకున్నారు. గూడూరులో పుల్లయ్య అనే వ్యక్తి నుంచి రూ.10,400 విలువచేసే 3,500 గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నట్లు ఎస్సై నాగార్జున తెలిపారు. వీరందరిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించామని పోలీసులు తెలిపారు.
  • బనగానపల్లి పట్టణం కొండపేటలోని చక్రవర్తి ఫంక్షన్ హాల్ సమీపంలో.. పోలీసులు దాడులు చేశారు. గుట్కా ప్యాకెట్లతో పాటు.. 96 కర్ణాటక మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5.19 లక్షలు ఉంటుందని ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని చెప్పారు.

కడప జిల్లాలో...

  • బ్రహ్మంగారి మఠం ప్రాంతంలో... పోలీసులు విస్తృత సోదాలు చేశారు. యాదాల సురేష్‌, యాదాల సూర్యానారాయణ, వివేకానందనగర్‌కు చెందిన కల్లూరినాగూర్‌బాషా.. బద్వేలు పట్టణంలోని వర్రా ఆంజనేయులు వద్ద పొగాకు ఉత్పత్తులు కొని విక్రయానికి యత్నిస్తుండగా.. అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.90లక్షలు విలువ చేసే పొగాకు ఉత్పత్తులు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నామని సీఐ టీవీ కొండారెడ్డి తెలిపారు. వర్రా ఆంజనేయులును అరెస్ట్‌ చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

అనంతపురం జిల్లాలో...

  • హిందూపురం పట్టణంలో నిషేధిత గుట్కా ప్యాకెట్ల స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు చేశారు. గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉంచిన ఆరుగురిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. వారి నుంచి లక్ష 60 వేల రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లు, కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
  • కదిరి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గుట్కా విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న డీఎస్పీ భవ్య కిషోర్.. చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలోని సిబ్బంది విస్తృత సోదాలు నిర్వహించారు. గుట్కా విక్రయిస్తున్న ఇద్దరిని గుర్తించి అరెస్టు చేశారు. రూ. 12 వేల విలువైన గుట్కా స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు జిల్లాలో...

  • జిల్లా వ్యాప్తంగా నిషేధిత గుట్కా, హాన్స్, పాన్ మసాలాలు విక్రయించే కిరాణా దుకాణలు, బడ్డీ కొట్లు, కిళ్లీ దుకాణాలు, అక్రమంగా నిల్వ చేసే ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సుమారు రూ.10 లక్షల విలువైన గుట్కా, పాన్ మసాలా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. 15 కేసులు నమోదు చేసి 15 మందిని అరెస్ట్ చేశారు. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలపై సమాచారం ఉంటే... డయల్ 100, పోలీసు వాట్సప్ నెంబర్ 9440900005 కు తెలియజేయాలని ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు.
  • పాలసముద్రం మండలం అయ్యవారికండ్రిగ పరిసర ప్రాంతాల్లో నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసులు నిర్బంధ తనిఖీలు చేశారు. గ్రామంలో ఉదయం 3 గంటల నుంచి 8 వరకు వంద మంది పోలీసు సిబ్బంది, అధికారులతో సోదాలు నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. వంద లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. పది వేల లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు. డాక్యుమెంట్లు లేని 5 మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అరెస్ట్ చేసి 27 మందిపై కేసులు నమోదు చేశారు. చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలయ్య, స్పెషల్ పార్టి ఆర్ ఐ వీరేశ్, ఎస్సైలు శ్రీనివాసులు, అనిల్, షేక్ షా వలీ, జయశంకర్, బాబు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

Jagan Delhi Tour: సీఎం జగన్ దిల్లీ పర్యటన వాయిదా

Last Updated : Jun 7, 2021, 8:49 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.