ETV Bharat / crime

పిల్లలపై పెట్రోలు పోసి నిప్పంటించిన తల్లి.. ఒకరు మృతి - పిల్లలపై పెట్రోలు పోసి నిప్పంటించిన తల్లి

Mother tried to kill childrens: వేరే కులం వ్యక్తిని ప్రేమించి.. తల్లిదండ్రులను ఎదురించి పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు వ్యతిరేకించినా.. భర్త, పిల్లలతో వేరే రాష్ట్రానికి వెళ్లి బతుకుతోంది. అయితే భార్యాభర్తల మధ్య మొదటి నుంచి గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. 9 ఏళ్లు గడిచాయి.. ఇప్పుడు దంపతుల మధ్య ఏం జరిగిందో తెలియదు.. ఇద్దరు పిల్లలను చంపేసి.. తల్లి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. పిల్లలపై పెట్రోల్​ పోసి నిప్పంటించింది.. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా.. మరో పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

mother killed her child
mother killed her child
author img

By

Published : Dec 7, 2022, 10:29 PM IST

Mother tried to kill childrens: కుటుంబ కలహాలతో తల్లి తన ఇద్దరు కూతుళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లా ముల్‌బాగల్ పట్టణంలోని అంజనాద్రి కొండ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 8 ఏళ్ల కుమార్తె అక్కడికక్కడే మృతి చెందగా, మరో కుమార్తె ప్రాణాలతో పోరాడుతోందని పోలీసులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లాలో పలమనేరు సమీపంలోని బుసాని కురుబాపల్లికి చెందిన బుసన్నగారి శంకరప్ప, లలితమ్మల కుమార్తె జ్యోతికి అదే గ్రామానికి చెందిన తిరుమలేష్‌తో కులాంతర వివాహమైంది. 9 ఏళ్ల క్రితం జ్యోతిని కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య మొదటి నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. అయితే మంగళవారం, తన పిల్లలతో ఇంటి నుండి బయలుదేరిన జ్యోతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

ఆ ప్రకారంగా గత రాత్రి ముల్‌బాగల్లు పట్టణంలోని అంజనాద్రి కొండ దిగువన తన పిల్లలతో కలిసి పెట్రోల్‌ వేసుకుని పడుకుంది. అనంతరం నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో నిద్రిస్తున్న 8 ఏళ్ల బాలిక అక్షయ గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన 6 ఏళ్ల ఉదయశ్రీ పరిస్థితి విషమంగా ఉంది. ఉదయశ్రీని తదుపరి చికిత్స నిమిత్తం జలప్ప ఆస్పత్రి నుంచి బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోతిని భర్త తిరుమలేష్ నిత్యం వేధించేవాడని చెబుతున్నారు. దీంతో తాను చనిపోతే తన పిల్లలను ఎవరు చూసుకుంటారని భావించి పెట్రోల్ పోసి హత్య చేయాలని నిర్ణయించుకుంది. అయితే చిన్నారుల ఆర్తనాదాలు చూసి చలించిపోయి కొండపైనే గడిపింది.

పల్లిగార పాళ్యకు చెందిన కొందరు బుధవారం తెల్లవారుజామున జాగింగ్ కోసం అంజనాద్రి కొండకు వెళ్లగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముళబాగిలు నగర పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి గాయపడిన బాలికను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ముళబాగిలు సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.