Mother daughter suicide: కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడులో జరిగింది. నవులూరి పద్మ (38), నవులూరి రమ్య (17) లు శనివారం ఉదయం గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం వరకూ తిరిగి రాకపోవడంతో పద్మ కుమారుడు పొలానికి వెళ్లి చూడగా... అక్కడ ఎవరూ కనిపించలేదు.
దీంతో అతను ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో వ్యవసాయ బావి వద్ద... అతని తల్లి పద్మ చెప్పులు, సెల్ ఫోన్ కనిపించడంతో బావిలో చూశాడు. బావిలో మృత దేహాలను గమనించి గ్రామంలోకి వెళ్లి విషయాన్ని బంధువులకు తెలిపాడు. బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. ఘటనపై నరసరావుపేట గ్రామీణ పోలీసులను విచారించగా... ఆత్మహత్యపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు.
ఇదీ చదవండి: కన్నతండ్రినే కడతేర్చిన కుమారులు.. శవాన్ని సరస్సులో పడేసి.