ETV Bharat / crime

రెండు రోజుల్లో శుభకార్యం.. కానీ అంతలోనే - ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు

CURRENT SHOCK: ఆ కుటుంబంలో రెండు రోజుల్లో శుభకార్యం ఉంది. అందుకోసం పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. బంధువుల రాక, పిండివంటల తయారీ.. ఇలా పెళ్లికి కావల్సిన పనులన్నీ చేస్తున్నారు. అయితే ఈ ఇంట్లో జరిగే తంతు చూడలేక దేవుడికి కన్నుకుట్టిందేమో.. ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. దీంతో పెళ్లి ఆగిపోయింది. అసలు ఏం జరిగింది.. పెళ్లి ఎందుకు ఆగిపోయిందంటే..!

CURRENT SHOCK
CURRENT SHOCK
author img

By

Published : Aug 8, 2022, 4:23 PM IST

Mother and Son died: రెండు రోజుల్లో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. వైభవంగా కూతురి పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దామనుకున్న ఆ తండ్రి తిరిగిరాని లోకాలకు పయనమయ్యాడు. ఈ విషాదకర ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.

జిల్లాలోని వేపాడ మండలం వావిలపాడు గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ఇంటి వెనుక ఉన్న పొలంలో మోటారు వేయడానికి వెళ్లి విద్యుత్​షాక్​తో మరణించాడు. అయితే మోటారు వేయడానికి వెళ్లిన కుమారుడు ఇంకా రాకపోవడంతో ఏమైందో చూద్దామని అతని తల్లి సింహాచలం వెళ్లింది. పొలంలో విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి.. ఏమైందోనన్న ఆతృతతో అతనిని తాకిన తల్లి కూడా మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. మరో రెండు రోజుల్లో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో.. ఇద్దరు మృత్యువాతపడడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.