భారీ వర్షాల ధాటికి పాత మిద్దె కూలి పశువుల పాకపై పడటంతో అందులోని 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం మునగలవారిపల్లిలో జరిగింది.
గ్రామానికి చెందిన మస్తాన్ తనకున్న గొర్రెల మందను నిన్న రాత్రి పాకలో చేర్చాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పాక పక్కనే ఉన్న ఓ పాత మిద్దె కూలి పడగా... పాకలోని 25 గొర్రెలు చనిపోయాయి. జీవనాధారమైన గొర్రెల మరణంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని యజమాని మస్తాన్ కోరుతున్నాడు.
ఇదీ చదవండి:
Rains in Andhra Pradesh: రాష్ట్ర వ్యాప్తంగా.. వర్షాలు విస్తారంగా...!