mla son escaped: తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాఘవేందర్ రావు పరారీలో ఉన్నారని ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. లొకేషన్ ట్రేస్ అవుట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అతని కోసం స్పెషల్ టీమ్‌లు గాలిస్తున్నాయని పేర్కొన్నారు.
రామకృష్ణ కుటుంబం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో దంపతులు సహా వారి కుమార్తె సజీవదహనం అయ్యారు. మరో కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబం సజీవదహనం ఆత్మహత్యేనని పోలీసులు తేల్చారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ దొరికిందని వెల్లడించారు. సూసైడ్ నోట్‌లో ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవేందర్ పేరు ఉంది. అతనితో పాటు రామకృష్ణ తల్లి సూర్యవతి, అక్క మాధవి పేర్లు కూడా ఉన్నాయి.
వనమా రాఘవేందర్‌కు రామకృష్ణ అక్క మాధవికి వివాహేతర సంబంధం ఉందని... వారివల్ల తనకు అన్యాయం జరుగుతోందని అందుకే... ఆత్మహత్య చేసుకున్నట్లు రామకృష్ణ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: